గెలాక్సీ ట్యాబ్ 3: బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Posted By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన ట్యాబ్లెట్ పీసీల పరిధిని మరింతగా విస్తరపంజేసే క్రమంలో గెలాక్సీ ట్యాబ్3 సిరీస్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో భాగంగా 310, 311, 211 శ్రేణుల్లో గెలాక్సీ ట్యాబ్3 పీసీలు లభ్యంకానున్నాయి. గెలాక్సీ ట్యాబ్3 311 వర్షన్ 3జీ వాయిస్ ఇంకా డేటా సపోర్టును కలిగి ఉంటుంది (ధర రూ25,725). మరో వేరియంట్ గెలాక్సీ ట్యాబ్3 310 వై-ఫై వర్షన్‌లో అందుబాటులో ఉంది(ధర రూ.24,945). మరో వర్షన్ గెలాక్సీ ట్యాబ్3 211 7 అంగుళాల స్ర్కీన్‌ను మాత్రమే కలిగి ఉంటుంది ధర రూ.17,745. జూలై 21 నుంచి ఈ ట్యాబ్లెట్ పీసీలు మార్కెట్లో లభ్యమవుతాయి. నేటి ప్రత్యేక శీర్షికలో గెలాక్సీ ట్యాబ్3 211 మోడల్ కు సంబంధించి మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం. ముందగా సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్3 211 స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై, బ్లూటూత్ 3.0, ఏ-జీపీఎస్, వాయిస్ కాలింగ్ కనెక్టువిటీ. విడుదల సమయంలో ఫోన్ అధికారిక ధర రూ.17,745

గెలాక్సీ ట్యాబ్ 3 ఫోటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot