శ్యాంసగ్ గెలక్సీ.. తొషిబా త్రైవ్ ‘ఛాయిస్ మీది’..?

Posted By: Super

శ్యాంసగ్ గెలక్సీ.. తొషిబా త్రైవ్ ‘ఛాయిస్ మీది’..?


‘‘గిరిలో నిలవాలంటే.. బరిలో గెలవాల్సిందే, జీవితానికే కాదు వ్యాపారానికి ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రస్తుత కంప్యూటింగ్ పరిశ్రమలో అవలంభిస్తున్న ఫార్ములా ఇదే.’’

కంప్యూటింగ్ మార్కెట్లో సాటి మేటిగా దూసుకుపోతున్న అంతర్జాతీయ బ్రాండ్లు‘శ్యాంసంగ్’, ‘తొషిబా’లు మరో సారి తమని తాము నిరూపించుకున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో 7 అంగుళాల టాబ్లెట్ పీసీలను ఈ రెండు బ్రాండ్లు డిజైన్ చేశాయి. ‘నువ్వా-నేనా’ అంటూ పోటీపడుతున్న ఈ గ్యాడ్జెట్ల ఫీచర్లేంటో చూద్దామా..

శ్యాంసంగ్ గెలక్సీ టాబ్ 7.0, తొషిబా త్రైవ్ 7 వర్షన్లలో ఈ టాబ్లెట్ పీసీలు విడుదలయ్యాయి. 7.0 వెడల్ప స్క్రీన్, టచ్ ఫెసిలిటీ, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి అంశాలు రెండు గ్యాడ్జెట్లలో సాధారణం. ‘స్క్రీన్’ రిసల్యూషన్ అంశాలను పరిశీలిస్తే శ్యాంసంగ్ గెలక్సీ (1024 x 600), తొషిబా త్రైవ్ (1280 x 800) సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

ఈ రెండు గ్యాడ్జెట్లలో ఒకే విధంగా ‘ఆండ్రాయిడ్ 3.2 ఆపరేటింగ్ వ్యవస్థ’ను లోడ్ చేశారు. ప్రాసెసర్ అంశాలను పరిశీలిస్తే శ్యాంసంగ్ (డ్యూయల్ కోర్ 1200 MHz), తోషిబా (1000 MHz) సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

కెమెరా ఫీచర్లను పరిశీలిస్తే స్వల్ప తేడాలను గమనించవచ్చు. శ్యాంసంగ్ రేర్ కెమెరా ‘3’మెగా పిక్సల్, ఫ్రంట్ కెమెరా ‘2’ మెగా పిక్సల్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. తొషిబా వెనుక భాగంలో అమర్చిన కెమెరా ‘5’ మెగా పిక్సల్, ముందు భాగంలో అమర్చిన కెమెరా ‘2’ మెగా పిక్సల్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

కనెక్టువిటీ అంశాలను పరిశీలిస్తే, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ పోర్ట్స్ తదితర అంశాలు వేగవంతంగా సమాచారాన్ని సరఫరా చేస్తాయి. పీసీలలో ఏర్పాటు చేసిన పటిష్ట బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలిక బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. భారతీయ మార్కెట్లో వీటి ధర అంశాలను పరిశీలిస్తే రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య ఉండొచ్చని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot