‘గణేష్ మహారాజ్’ సాక్షిగా ‘బెర్లిన్’లో..!!

Posted By: Super

‘గణేష్ మహారాజ్’ సాక్షిగా ‘బెర్లిన్’లో..!!

‘‘శ్యామ్‌సంగ్ వినియోగదారులకు వినాయక చవితి పూట మరో తీప మాట..!! శ్యామ్‌సంగ్ తన శక్తినంతా దారపోసి రూపొందించిన మూడు అధునాతన సాంకేతిక పరికరాలను గురువారం బెర్లిన్‌లో విడుదల చేయునంది..’’

ఏదో ఒక కొత్త ఐడియాతో పోటీ బ్రాండ్లకు దడ పుట్టంచే శ్యామ్‌సంగ్ మరో కొత్త ప్రయోగంతో మార్కెట్‌ను తాకనుంది. సాంకేతిక వస్తు ప్రపంచంలో కొత్త మార్పుకు శ్రీకారం చుడుతూ ‘శ్యామ్‌సంగ్’ మొబైల్ హ్యాండ్ సెట్లతో పాటు టాబ్లెట్స్, మొబైల్ కంప్యూటింగ్ టాబ్లెట్లను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు పూర్తి చేసింది. శ్యామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 7.7, గెలక్సీ నోట్, శ్యామ్‌సంగ్ వేవ్ 3, పేర్లతో మూడు అద్వితీయమైన గ్యాడ్జెట్లను సెప్టంబర్ 1న విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ విడుదలకు సంబంధించిన వివరాలను ఓ వైబ్ సైట్లో పొందుపరిచింది.

శ్యామ్‌సంగ్ సరికొత్త టాబ్లెట్ ‘గెలక్సీ 7.7’, పాత మోడళ్లైన 7,8.9, 10.1 అంగుళాలా సెట్లకు ధీటుగా రూపుదిద్దుకుంది. అయితే విడుదల కాబోతున్న ‘గెలక్సీ 7.7’ 10.1 అంగుళాల స్క్రీన్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ టాబ్లెట్‌కి సంబంధించి ఇతర విషయాలు తెలియాల్సి ఉంది. విడుదల కాబోతున్న మరో గ్యాడ్జెట్ ‘శ్యామ్‌సంగ్ వేవ్ 3’లో బడా సాఫ్ట్ వేర్‌ను అప్‌డేట్ చేస్తూ రూపొందించారు. అయితే ఇప్పటికే ఆధునీకరంచిన బడా 2.0 సాఫ్ట్ వేర్ డవలెప్‌మెంట్ కిట్ మార్కెట్లో విడుదలైంది.

భారీ అంచనాల మధ్య విడుదలకాబోతున్న ‘గెలక్సీ నోట్’కు సంబంధించి వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే విడుదల కాబోతున్న ‘వేవ్ 3’ మాత్రం అధునాతన బడా 2.0 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తుందని తెలుస్తోంది. ఆమోల్డ్ డిస్‌ప్లే సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ 5 మోగా పిక్సల్ రేర్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్‌కు ఉపయుక్తంగా ఫ్రంట్ కెమెరా ఆప్షన్ కలిగి ఉంటుంది. శ్యామ్‌సంగ్ గెలక్సీ‌నోట్‌కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ గ్యాడ్జెట్లకు సంబంధించి పూర్తి వివరాలు సెప్టంబర్ 1న తెలుస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot