వావ్.. లక్కీ ఛాన్స్!!

Posted By: Staff

వావ్.. లక్కీ ఛాన్స్!!

సర్వోత్తమ బ్రాండ్ శామ్‌సంగ్ తన గెలక్సీ సిరీస్ లైనప్ నుంచి అనేక వేరియంట్‌లలో టాబ్లెట్ కంప్యూటర్లను లాంఛ్ చేసింది. వీటిలో తాజాదైన గెలక్సీ ట్యాబ్ 7.7 ఇటీవలే ఇండియన్ రిటైల్ మార్కెట్లోకి వచ్చింది. ప్రముఖ


ఆన్‌లైన్ రిటైల్ సంస్థలైన Flipkart, LetsBuyలు వీటిని విక్రియిస్తున్నాయి. మార్కెట్లో ఈ టాబ్లెట్ నిర్థిష్ట ధర రూ.33,000. Flipkart.com ఈ ధరను 28,500 తగ్గించింది , అంతేకాకుండా గెలక్సీ ట్యాబ్ 7.7 కోనుగోలు పై Rs 3,099 విలువ చేసే శామ్‌సంగ్ బుక్ కవర్‌ను ఆఫర్ చేస్తుంది. మరో విక్రయికర్త వొడాఫోన్ ఇండియా ట్యాబ్ 7.7ను రూ.26,149కే ఆఫర్ చేస్తుంది. ఈ రాయితీ ప్రత్యేకించి వొడాఫోన్ వినియోగదారులకేనా లేదా ఎవరికైనానా అన్న అంశం పై ఖచ్చితమైన క్లారిటీ లేదు. ఈ సీజన్‌లో టాబ్లెట్ కొందామని నిర్ణయించుకన్న వారు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.

గెలక్సీ ట్యాబ్ 7.7 ఫీచర్లు:

* 16 మిలియన్ల రంగులతో సుసంపన్నమైన 7.7 సూపర్ ఆమోల్డ్ టచ్ స్ర్కీన్, ( రిసల్యూషన్ 1280x 800పిక్సల్స్),


* టాబ్లట్ బరువు 340 గ్రాములు,


* డ్యూయల్ కోర్ 1.4జిగాహెడ్జె ఆర్మ్ కార్టెక్స్ -ఏ9 ప్రాసెసర్,


* 1జీబి ర్యామ్,


* మాలీ-400ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,


* ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం,


* యూజర్ ఇంటర్‌ఫేస్ టచ్‌విజ్ UX UI,


* జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, హెచ్‌ఎస్‌పీఏ కనెక్టువిటీ,


* వాయిస్ కాల్ సపోర్ట్,


* ఇన్‌బుల్ట్ మెమెరీ 16/32/64 GB,


* 3.2 మెగా పిక్సల్ ఆటో ఫోక్స్ కెమెరా (రిసల్యూషన్ 2048×1536 పిక్సల్స్), ఎల్ ఈడి ఫ్లాష్, జీయో టాగింగ్,


* 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,


* 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,


* స్టీరియో స్పీకర్స్,


* వై-ఫై 802.11 a/b/g/n , బ్లూటూత్ 3.0, హెచ్ డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ కనెక్టువిటీ,


* మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,


* జీపీఎస్ సపోర్ట్, డిజిటల్ కంపాస్,


* ఆడోబ్ ఫ్లాష్ వర్షన్ 11 సపోర్ట్,


* క్వాలిటీ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్


* 5100 mAh Li-Po రీఛార్జబుల్ బ్యాటరీ.


Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot