గెలాక్సీ ట్యాబ్ ఎస్‌ను ప్రదర్శించిన సామ్‌సంగ్

|

న్యూయార్క్‌లో జరుగుతున్న గెలాక్సీ ప్రీమియర్ 2014 ఈవెంట్‌లో భాగంగా సామ్‌సంగ్ రెండు గెలాక్సీ ట్యాబ్ ఎస్ ట్యాబ్లెట్‌లను ప్రదర్శించింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 అంగుళాలు ఇంకా 8.4 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. జూన్ 26 నుంచి ఎంపిక చేయబడిన మార్కెట్లలో ఈ ట్యాబ్లెట్‌లను విక్రయించనున్నారు.

 
గెలాక్సీ ట్యాబ్ ఎస్‌ను ప్రదర్శించిన సామ్‌సంగ్

గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 ట్యాబ్లెట్ వేరియంట్‌కు సంబంధించి కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... సూపర్ అమోల్డ్ డబ్ల్యూక్యూఎక్స్ జీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్2560×1600పిక్సల్స్, 288 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ ఎక్సినోస్ 5 ఆక్టా కోర్ చిప్‌సెట్ మార్కెట్‌ను బట్టి క్వాడ్‌కోర్ 1.9గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ15 కోర్ ఇంకా క్వాడ్‌కోర్ 1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 కోర్ లేదా 2.3గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ చిప్‌సెట్, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ మెమెరీ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫింగర్ ప్రింట్ స్కాన్,7,900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ ట్యాబ్ ఎస్‌ను ప్రదర్శించిన సామ్‌సంగ్

గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8.4 ట్యాబ్లెట్ వేరియంట్‌కు సంబంధించి కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 8.4 అంగుళాల సూపర్ అమోల్డ్ డబ్ల్యూక్యూఎక్స్ జీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1600పిక్సల్స్, 359పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ ఎక్సినోస్ 5 ఆక్టాకోర్ చిప్‌సెట్ (క్వాడ్‌కోర్ 1.9గిగాహెట్జ్ కార్టెక్స్ - ఏ15 కోర్ మరియు క్వాడ్‌కోర్ 1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 కోర్) లేదా 2.3గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్ - కోర్ చిప్‌సెట్. 3జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ మెమెరీ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫింగర్ ప్రింట్ స్కానర్, 4,900ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ ట్యాబ్ ఎస్ ధర ఇంకా అందుబాటు

రెండు స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమవుతోన్న గెలాక్సీ ట్యాబ్ ఎస్ అమ్మకాలు యూఎస్ మార్కెట్లో జూలై నుంచి ప్రారంభంకానున్నాయి గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10.5 16జీబి వై-ఫై వర్షన్ ధర అంచనా 499 డాలర్లు(ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.29,990), గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8.4 16జీబి వై-ఫై వర్షన్ ధర అంచనా 399 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.23,940). గెలాక్సీ ట్యాబ్ ఎస్ ఇండియన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X