బ్లాక్‌బెర్రీ రూ. 27,000కే, శ్యామ్‌సంగ్ రూ.23,990కే ఏది బెస్టో..?

By Super
|
Blackberry Playbook

‘‘టాబ్లెట్ మార్కెట్లో దిగ్గజాల పోరు మొదలైంది. ప్రముఖ సాంకేతిక పరికరాల బ్రాండ్లైన ‘శ్యామ్‌సంగ్’, ‘బ్లాక్‌బెర్రీ’లు నువ్వా - నేనా అంటూ పోటి పడుతున్నాయి. శ్యామ్‌సంగ్ విడుదల చేసిన ‘శ్యామ్‌సంగ్ P1000 గెలక్సీ ట్యాబ్’, బ్లాక్‌బెర్రీ విడుదల చేసిన ‘బ్లాక్‌బెర్రీ ప్లే బుక్‌లు’ ఎంపిక విషయంలో వినియోగదారులకు అగ్ని పరీక్షను పెడుతున్నాయి.

క్లుప్తంగా ‘గెలక్సీ P1000 ట్యాబ్ ఫీచర్లు’:

- 7 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్క్రీన్ సామర్ధ్యంతో రూపుదిద్దుకున్న గెలక్సీ ట్యాబ్ డిస్‌ప్లే శక్తివంతమైన గొరిల్లా గ్లాస్‌తో రూపొందించబడింది.
- కేవలం 380 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ టాబ్లెట్ పీసీ మన్నికైన ఫీచర్లను కలిగి ఉంటుంది.
- 512 ఎంబీ ఇంటర్నల్ మెమరీ, పొందుపరిచిన మైక్రో ఎస్డీ స్లాట్ ద్వారా 32జీబీకి సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు.
- 3.5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను టాబ్లెట్ పీసీలో పొందుపిరిచారు.
- అత్యాధునిక ఫీచర్లతో రూపుదిద్దకున్న శ్యామ్‌సంగ్ గెలక్సీ ఇండియన్ మార్కెట్లో రూ. 23,990కు లభ్యమవుతుంది.

క్లుప్తంగా ‘బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ ఫీచర్లు:

- 7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ వ్యవస్థ , మల్టీ‌టచ్ స్ర్కీన్ ఇన్‌పుట్ ఆధారితంగా పనిచేస్తుంది.
- ఆండ్రాయిడ్ v2.2 ఫ్రోయో ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ప్లేబుక్ పనిచేస్తుంది.
- 16, 32, 64 జీబీల వేరియంట్లలో బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ లభ్యమవుతుంది.
- ప్లేబుక్‌లో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ రేర్ కెమెరాతో పాటు 3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థ నాణ్యమైన చిత్రాలను పదిలపరచటంతో పాటు మన్నికైన వీడియో ఛాటింగ్ కు ఉపకరిస్తుంది. .
- ధర విషయానికి వస్తే వివిధ కాన్ఫిగరేషన్లలో లభ్యమవుతున్న బ్లాక్‌బెర్రీ ఫ్లేబుక్‌ల ధర రూ.27,000 నుంచి రూ.38,000 వరకు పలుకుతోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X