‘నాన్‌స్టాప్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్’ త్వరలో...!!

Posted By: Super

‘నాన్‌స్టాప్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్’ త్వరలో...!!

యుద్ధ భూమిలో కత్తిపట్టి ప్రత్యర్థిని చిత్తుచేస్తున్న ప్రత్యక్ష అనుభూతి..!!, రయ్ మంటూ రేస్ బైక్ పై దూసుకుపోతున్న ఎమెజింగ్ థ్రిల్..!!, స్పేస్‌జెట్‌లో విశ్వంలో విహరిస్తున్న ఎక్సైట్‌మెంట్.., ఇలా ప్రతి క్షణమూ మీకు ఉత్కంఠతతో కూడిన అనుభూతే.. మాటలకు అందని అనుభూతులను కళ్లెదుట ఆవిష్కరిస్తూ, అల్టిమేట్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో శ్యామ్‌సంగ్ ప్రవేశపెట్టబోతున్న ఓ ల్యాప్‌‌టాప్ ప్రత్యేకంగా ఆటల ప్రపంచాన్ని మీ ముందరుంచుతుంది.

శ్యామ్‌సంగ్ చేపడుతున్న ఈ ప్రయోగం గేమింగ్ వ్యవస్థలో అధునాతన సమీకరణలకు నాంది పలకనుంది. తొలిగా ఈ ‘గేమింగ్ ల్యాపీని’ సెప్టంబర్‌లో జర్మనీలో విడుదల చేయునున్నారు. నాన్‌స్టాప్ గేమింగ్ వ్యవస్థతో రూపుదిద్దకుంటున్న ‘శ్యామ్‌సంగ్ 700G7A’ మోడల్ పైనే ప్రస్తుత మార్కెట్ వర్గాల దృష్టి కేంద్రీకృతమయ్యంది.

ఈ ల్యాపీలోని ఫీచర్లను పరిశీలిస్తే క్వాడ్ కోర్, ఇంటెల్ కోర్ i7- 2630QM ప్రొసెసింగ్ వ్యవస్థను పొందుపరిచారు. గేమింగ్ వ్యవస్థలో కీలక భాగమైన గ్రాఫిక్ చర్యలను నాణ్యతతో పాటు సమర్థంతంగా నడిపించేందుకు ‘డైరెక్టస్ 11’ హై వర్షన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

పొందుపరిచిన ఏఎమ్‌డి రాడియోన్ హెచ్‌డీ 6970M జీపీయూ స్పెసిఫికేషన్ వ్యవస్థ హై డెఫినిషన్ ప్రమాణాలతో ప్రత్యక్ష అనుభూతిని వినియోగదారునికి అందిస్తుంది. 2జీబీ డీడీఆర్ మెమరీ మరో ప్రత్యేకత. మెమరీని పెంచుకునే వారు అదనంగా పలు వ్యవస్థలను జోడించుకోవల్సి వస్తుంది. అయితే ధర కాస్త ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే ‘శ్యామ్‌సంగ్ 700G7A’ 17.3 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఎల్‌ఈడి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక కీ బోర్డును పరిశీలిస్తే గేమింగ్‌కు సులువుగా W, A, S, D బటన్లు ‘ఎరుపు’ రంగులో తీర్చిదిద్దారు. మిగిలిన బట్లను ‘బ్లూ’ రంగులో ఉంటాయి.

కనెక్టువిటీ విషయానికి వస్తే ఈ వైర్‌లెస్ గేమింగ్ వ్యవస్థ ల్యాప్‌టాప్‌ను సమర్థవంతంగా, సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లోచ్చు. వివిధ రకాలు ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లను ఈ సెట్‌లో ప్రవేశపెట్టారు. బ్లూటూత్ వర్షన్ 3, యూఎస్బీ పోర్టు వి.3.0 వంటి వ్యవస్థలు డేటాను అత్యంత వేగంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. చివరిగా ఆడియో విషయానికి వస్తే 2.1 ఎఫెక్టుతో పాటు అదనంగా పొందుపరిచిన సబ్‌వూఫర్ వ్యవస్థ మిమ్మల్ని మంత్రముగ్థుల్ని చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot