సిద్ధమవుతున్న మరో ఫ్లాన్..?

By Super
|
Samsung is working on a dual screen tablet


గెలక్సీ సిరీస్ నుంచి అనేక వేరియంట్‌లలో టాబ్లెట్ పీసీలను రూపొందించిన సామ్‌సంగ్ వినూత్న తరహా ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. డ్యూయల్ స్ర్కీన్ టాబ్లెట్ పీసీ తయారు చేసే పనిలో ఈ దిగ్గజం నిమగ్నమైంది. ఈ డివైజ్ డిజైనింగ్‌కు సంబంధించి సామ్‌సంగ్ పేటెంట్ దాఖలు చేసినట్లు తెలిసింది. రిమోట్ కంట్రోల్ వ్యవస్థ డివైజ్‌కు మరో ఆకర్షణగా నిలవనుంది.

ఈ తరహా డ్యూయల్ స్ర్ర్కీన్ టాబ్లెట్ పీసీని తోషిబా రూపొందించింది. పేరు లైఫ్‌టైమ్ నోట్‌బుక్. తోషిబాను అనుసరిస్తూ ఏసర్ ఐకోనియా 6120 మోడల్ పేరుతో డ్యూయల్ టచ్ స్ర్కీన్ నోట్‌బుక్‌ను విడుదల చేసింది. వీరి జాబితాలో చేరిన సోనీ టాబ్లెట్ ‘పీ’ పేరుతో

5.5 అంగుళాల టచ్ స్ర్కీన్‌తో కూడిన డ్యూయల్ స్ర్కీన్ గ్యాడ్జెట్‌ను డిజైన్ చేసింది. సామ్‌సంగ్ రూపొందిస్తున్న సరికొత్త డ్యూయల్ సిమ్ టాబ్లెట్ పెద్దవైన డిస్‌ప్లే స్ర్కీన్‌లను కలిగి ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలో విడుదలై డ్యూయల్ స్ర్కీన్ టాబ్లెట్లు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు.

సామ్ సంగ్ విండోస్ ఫోన్ లు ఈ ఏడాదిలోనే!!

అవును 2012కు గాను శామ్‌సంగ్ విండోస్ కాంభినేషన్ లో మూడు విండోస్ స్మార్ట్‌ఫోన్‌లు రానున్నాయి. ఇదేంటి శామ్‌సంగ్ ఎప్పుడు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లనే ఎంచుకుంటుంది కదా ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా..? విండోస్ ఆపరేటింగ్ సిస్టంలకు మార్కెట్లో పెరగుతున్న ఆదరణను పరిగణలోకి తీసుకుని శామ్‌సంగ్ ఈ నిర్ణయం తీసకున్నట్లు సమాచారం. విడుదల కాబోతున్న మూడు విండోస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒక మోడల్‌కు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

పేరు: శామ్‌సంగ్ మండెల్ ఎస్‌జీహెచ్ -ఐ667,

డిస్‌ప్లే: WVGA,

ఆపరేటింగ్ సిస్టం: విండోస్ ఫోన్ ట్యాంగో (విండోస్ ఫోన్ 7.5 రిఫ్రెష్),

కనెక్టువిటీ: ఎల్‌టీఈ.

తక్కిన రెండు మోడల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే వీటిలో విండోస్ ఫోన్ అపోలో ఆపరేటింగ్ సిస్టంను నిక్షిప్తం చేసినట్లు సమచారం. 2012 చివరిలో వీటిని లాంఛ్ చేసే అవకాశముంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X