త్వరలో సామ్‌సంగ్ నుంచి 4 కొత్త టాబ్లెట్‌లు

Posted By:

త్వరలో సామ్‌సంగ్ నుంచి 4 కొత్త టాబ్లెట్‌లు

గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న సామ్‌సంగ్ అభిమానులకు శుభవార్త. సౌత్ కొరియన్ టెక్నాలజీ దిగ్గ‌జమైన సామ్‌సంగ్ నూతన సంవత్సర ప్రణాళికల్లో భాగంగా మధ్య ముగింపు ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్ డివైజ్‌ల రూపకల్పన పై దృష్టిసారించనట్లు సమాచారం.

సామ్ మొబైల్స్ వెల్లడించిన వివరాల మేరకు సామ్‌సంగ్, 2014 మొదటి త్రైమాసికంలో 4 టాబ్లెట్ డివైజ్‌లను మధ్య విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

సామ్ మొబైల్స్ అంచనా మేరకు ఈ నాలుగు మోడళ్లలో మొదటి రకం టాబ్లెట్ అయిన టాబ్ 3 లైట్ (ఎమ్-టీ111) ధర 100 యూరోలు ఉండొచ్చని తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.8,532. ఈ డివైజ్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తక్కిన మూడు మోడల్స్ ఆమోల్డ్ డిస్‌ప్లే ఫీచర్‌ను కలిగి ఉంటాయని సామ్ మొబైల్స్ పేర్కొంది. వీటిలో ఒక 12 అంగుళాల గెలాక్సీ నోట్ వేరియంట్ (ఎస్ఎమ్-పీ900), 13.3 అంగుళాల కన్వర్టబుల్ డ్యూయల్ బూట్ విండోస్ ఇంకా ఆండ్రాయిడ్ టాబ్లెట్ వేరియంట్ ఉంటుందని సామ్ మొబైల్ పేర్కొంది. వీటిని 2014 ఫిబ్రవరిలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎక్స్ పోలో విడుదల చేసే అవకాశముంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot