‘విశ్వరూపానికి’ ఇంకా నాలుగు రోజులే..?

Posted By: Prashanth

‘విశ్వరూపానికి’ ఇంకా నాలుగు రోజులే..?

 

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో ముగియటంతో టెక్ ప్రేమికుల ద్ళష్టి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వైపు మళ్లింది. ఈ నెల 27 నుంచి ప్రారంభంకానున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అనేక ఆవిష్కరణలకు వేదిక కానుంది. దిగ్గజ శ్రేణి బ్రాండ్ శామ్‌సంగ్ ఈ వేదిక పై రెండు ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ కంప్యూటర్లను లాంఛ్ చేస్తున్నట్లు జపాన్ టెక్ పోర్టల్ Ameblo.jp వెల్లడించింది. జీటీ-పీ3100, జీటీ-పీ5100 నమూనాలలో ఈ డివైజ్‌లు రూపుదిద్దుకున్నట్లు ఈ టెక్ పోర్టల్ పేర్కొంది. ఆండ్రాయిడ్ లెటేస్ట్ వర్షన్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ 4.0 ఆపరేటింగ్ వ్యవస్థను ఈ టాబ్లెట్ పీసీలలో లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమోజోన్ కిండిల్ ఫైర్‌కు పోటీగా శామ్‌సంగ్ ఈ ఆవిష్కరణలు చేపడుతున్నట్లు పలు విశ్లేషణలు అంచనావేస్తున్నాయి.

ఈ పీసీలలో నిక్షిప్తం చేసిన ముఖ్య విశేషాలు:

* రెటినా డిస్‌ప్లే,

* 2 GHz క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

* ధర రూ 15,000 (అంచనా మాత్రమే).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot