అక్టోబర్ ‘10’న శ్యామ్‌సంగ్ సీక్రెట్ ఏంటి..?

Posted By: Staff

అక్టోబర్ ‘10’న శ్యామ్‌సంగ్ సీక్రెట్ ఏంటి..?

టెక్నాటజీ మార్కెట్‌ను శాసిస్తున్న ‘శ్యామ్‌సంగ్’ అక్టోబర్ 10న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వినియోగదారులను సంతృప్తి పరచటంలో విజయవంతమైన ఈ బ్రాండ్ అదే ఒరవడిని కొనసాగిస్తూ మార్కెట్లో దూసుకుపోతుంది.

ఆధునిక అపడేటెడ్ ఫీచర్ల మేళవింపుతో రూపుదిద్దుకున్న ‘శ్యామ్‌సంగ్ సరీస్ 7 ఆల్ ఇన్‌ వన్’ కంప్యూటర్ పరికరాలు అక్టోబర్ 10న అమెరికాలో విడుదల కానున్నాయి.

స్టన్నింగ్ లుక్‌తో మైమరిపించే ఈ గ్యాడ్జెట్లు ‘శ్యామ్‌సంగ్’కు కొత్త ట్రెండ్‌ను తెచ్చిపెడతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. నాణ్యమైన ఆల్యూమినియం ప్యానెల్‌తో మృదువుగా నిర్మించబడిన ఈ ‘ప్రొఫెషనల్ కంప్యూటర్’ 1920*1080 రిసల్యూషన్ సామర్ధ్యంతో కూడిన 23 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. టచ్ స్ర్కీన్ వ్యవస్థ, పీసీకి మరో ప్రత్యేక ఆకర్షణ

అత్యంత శక్తివంతమైన ఇంటెల్ కోర్ i5 ప్రొసెసర్ వేగవంతమైన పనితీరును కలిగి ఉంటుంది. కొత్త జనరేషన్ ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ టెక్నాలజీని పీసీలో పొందుపరిచారు. 8జీబీ సామర్ధ్యం కలిగిన పటిష్ట ర్యామ్ వ్యవస్థ వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తుంది.

ఉన్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ‘విండోస్ 7 హోమ్ ప్రీమియమ్’ ఆపరేటింగ్ వ్యవస్థను ఈ పీసీలో వినియోగించారు. పీసీలో ఏర్పాటు చేసిన బ్లూటూత్, వై-ఫై కనెక్టువిటీ అంశాలు సమాచార వ్యవస్ధను మరింత పటిష్టితం చేస్తాయి.

ఆప్టికల్ డ్రైవ్, 1 ట్యాబ్ సామర్ధ్యం గల హార్డ్‌డ్రైవ్ వ్యవస్థలు పీసీ పనితీరును పటిష్ట పరుస్తాయి. అత్యాధునిక 4w హార్మన్ స్పీకర్ వ్యవస్థను పీసీలో ఏర్పాటు చేశారు. 2.0,3.0 సామర్ధ్యం గల 5 యూఎస్బీ పోర్టులను పీసీలో అమర్చారు.

ఏర్పాటు చేసిన 1.3 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థ నాణ్యమైన ఫోటో నాణ్యతను అందిస్తుంది. ఒక సంవత్సరం వారంటీతో విడుదలవుతున్న ‘శ్యామ్‌సంగ్ సరీస్ 7 ఆల్ ఇన్ వన్’ పీసీ ధరలు రూ.40,000 నుంచి రూ.49,000 వరకు ఉన్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting