శాంసంగ్ ఇండియాలో చరిత్ర సృష్టించేందుకే...

Posted By: Super

 శాంసంగ్ ఇండియాలో చరిత్ర సృష్టించేందుకే...

 

ఇండియన్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లోకి శాంసంగ్ కొత్తగా 7 ఇంచ్ టాబ్లెట్‌ని ప్రవేశపెట్టనుంది. ఈ టాబ్లెట్‌ని పవర్‌పుల్ స్మార్ట్ ఫోన్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. శాంసంగ్ విడుదల చేయనున్న టాబ్లెట్ పేరు 'శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ 620'. ఈ టాబ్లెట్‌లో ఆండ్రాయిడ్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 3.2 వర్సన్‌ని నిక్షిప్తం చేశారు. మ్యూజిక్, వీడియోస్, ఇంటర్నెట్‌ని ఈ టాబ్లెట్ ద్వారా చాలా ఫాస్టుగా యాక్సెస్ చేసుకోవచ్చు. డేటాని చాలా ఫాస్టుగా ట్రాన్పర్ చేసుకునే వెసులుబాటుని కూడా ఇందులో కల్పించారు.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ 620 ప్రత్యేకతలు:

* 1.2 GHz Processor

* 1 GB RAM

* 7 inch display screen

* Capacitive touch

* Can act as a smartphone as well as a tablet

* Video features like conferencing and calling supported

* Android 3.2 version supported

మల్టీ టాస్కింగ్ పనులను వేగవంతం చేసేందుకు గాను ఈ టాబ్లెట్‌లో 1.2 GHz ప్రాసెసర్‌తో పాటు, 1 GB DDR 2 RAM నిక్షిప్తం చేశారు. వెనుక ఉన్న 3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయడమే కాకుండా, వీడియోలను 720p HD రిజల్యూషన్ ఫార్మెట్‌లో తీయవచ్చు. టాబ్లెట్ ముందు భాగాన ఉన్న 2 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో వీడియో కాన్పరెన్స్ ఫీచర్‌ని కస్టమర్స్ ఉపయోగించుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot