సామ్‌సంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు

Posted By:

సామ్‌సంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ ఆదివారం నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అన్‌ప్యాకుడ్ ఈవెంట్‌లో భాగంగా తన గెలాక్సీ గేర్ 2 స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా విడుదలైన గెలాక్సీ గేర్ 2 స్మార్ట్‌వాచ్ రెండు వేరియంట్‌లలో లభ్యంకానుంది. వీటిలో మొదటి వేరియంట్ గెలాక్సీ గేర్ 2, రెండవ వేరియంట్ గెలాక్సీ గేర్ 2 నియో. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు సామ్‌సంగ్, ఇంటెల్ సంయుక్తంగా రూపొందించిన లైనెక్స్ ఆధారిత టైజన్ ఆపరేటింగ్ సిస్టి పై స్పందిస్తాయి.

గెలాక్సీ గేర్ 2 స్పెసిఫికేన్‌లను పరిశీలించినట్లయితే...

లైనెక్స్ ఆధారిత టైజన్ ఆపరేటింగ్ సిస్టం, 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 320 X 320పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, యాక్సిలరోమీటర్, గైరో సెన్సార్, హార్ట్‌రేట్ సెన్సార్, స్మార్ట్‌వాచ్‌లను యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించుకునేందుకు ఐఆర్ ఎల్ఈడి పోర్ట్‌ను నిక్షిప్తం చేసారు. 2 మెగా పిక్సల్ కెమెరాను గేలాక్సీ గేర్ 2లో నిక్షిప్తం చేసారు. గేర్ 2 నియో వేరియంట్లో కెమెరా ఫీచర్ లోపించింది. గెలాక్సీ గేర్ 2 స్మార్ట్‌వాచ్ మెటల్ బాడీని కలిగి ఉండగా, గేర్ 2 నియో వేరియంట్ ప్లాస్టిక్ బాడీని కలిగి ఉంటుంది. ఈ రెండు వేరియంట్‌లు ఐపీ67 సర్టిఫికేషన్ కలిగి వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్ వ్యవస్థలను కలిగి ఉన్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot