ఐఎఫ్ఏ 2014... సామ్‌సంగ్ నుంచి 105 అంగుళాల టీవీ

Posted By:

ఐఎఫ్ఏ 2014లో సామ్‌సంగ్ ఆవిష్కరణల జోరు కొనసాగుతోంది. గురువారం బెర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఏ 2014 ప్రీ ఈవెంట్‌లో భాగంగా 105 అంగుళాల బెండబుల్ అల్ట్రా హైడెఫినిషన్ టీవీని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఆవిష్కరించింది. ఈ టీవీని కావల్సిన విధంగా వొంపు తిప్పుకోవచ్చు.

ఐఎఫ్ఏ 2014... సామ్‌సంగ్ నుంచి 105 అంగుళాల టీవీ

ఇప్పటి వరకు చదరంగా ఉండే ఫ్లాట్ ఫ్యానల్, కర్వుడ్ శ్రేణి టీవీలను విపణిలోకి తీసుకువచ్చిన సామ్‌సంగ్ మొట్టమొదటి సారిగా ప్రపంచపు అతిపెద్ద బెండబుల్ టీవీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కావాలంటే, ఫ్లాట్‌గా, కోరుకున్నప్పుడు వొంపు తిరిగేలా మార్చుకునే వీలున్న ఈ అల్ట్రా హైడెఫినిషన్ టీవీని తొలత ఐరోపా మార్కెట్లలో విక్రయిస్తామని సామ్ సంగ్ తెలిపింది. ధర వివరాలు తెలియాల్సి ఉంది.

సామ్‌సంగ్ 105 అంగుళాల బెండబుల్ టీవీ ప్రత్యేకతలు:

105 అంగుళాల హైడెఫినిషన్ తెర (రిసల్యూషన్ 5120X2160 పిక్సల్స్),
బెండబుల్ టెక్నాలజీ,
160వాట్ ఇన్‌బుల్ట్ స్పీకర్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Samsung Launches Monster 105 Inch UHD Curved TV That Bends. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot