రంగుల లోకాన్ని రుచిచూపించే ‘శ్యామ్‌సంగ్ సిరీస్ 3’..!!

Posted By: Super

రంగుల లోకాన్ని రుచిచూపించే ‘శ్యామ్‌సంగ్ సిరీస్ 3’..!!


‘‘దిగ్గజ సాంకేతిక పరికరాల తయారీదారు ‘శ్యామ్‌సంగ్’ ఇప్పటి వరకు మార్కెట్లో ప్రవేశపెట్టన మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్, నోట్‌బుక్, టాబ్లెట్ పీసీ వంటి గ్యాడ్జెట్లు ప్రపంచ వ్యాప్తంగా అదరహో అనిపించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ బ్రాండ్ తాజాగా విడుదల చేయుబోతున్న 3 సిరీస్ అల్ట్రాలు పోర్టబుల్ ల్యాపీలు అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఆకర్షిస్తాయని సంస్ధ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. బ్లాక్, రెడ్, పర్పిల్, సిల్వర్, వైట్ రంగుల్లో డిజైన్ చేయబడ్డ ఈ ల్యాపీ పరికరాలు వినియోగదారుల మదిని కొల్లగొడతాయట. 3 సిరీస్ లో ప్రధానమైన 350 U మోడల్ ను ముఖ్యంగా ఆడవారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారట. యువత కోరుకునే స్టైల్‌కు తగ్గట్టుగా ల్యాపీలను డిజైన్ చేయ్యటంలో కంపెనీ వర్గాలు కీలకంగా దృష్టిసారించాయని తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టే శ్యామ్‌సంగ్ 3 సిరీస్ అల్ట్రాపోర్టబుల్ ల్యాపీల ధరలు రూ.43,000 ఉండోచ్చని విశ్లేషక వర్గాలు భావిస్తున్నాయి.’’

క్లుప్తంగా శ్యామ్ సంగ్ 3 సిరీస్ ఫీచర్లు:

- పటిష్టమైన i5 ప్రొసెసింగ్ వ్యవస్థ, 640జీబీ హార్డ్ డ్రైవ్ స్టోరేజి వ్యవస్థలు ల్యాపీ పనితీరును మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దుతాయి.

- 12.5 అంగుళాల ధృడమైన డిస్‌ప్లే నాణ్యమైన క్లారిటీని వినియోగదారునికి అందిస్తుంది.

- 1.3కిలో గ్రాముల అతి తక్కువ బరువు కలిగి ఉండే ఈ ల్యాపీ పరికరాలు 8 గంటల బ్యాకప్ సామర్ధ్యంతో కూడిన పటిష్టమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot