సోలార్ ఆధారితంగా పనిచేసే ‘శ్యామ్ సంగ్ NC215’.!

Posted By: Staff

సోలార్ ఆధారితంగా పనిచేసే ‘శ్యామ్ సంగ్ NC215’.!


‘‘సోలార్ వవ్యస్థ ఆధారితంగా పని చేసే నెట్‌బుక్ పరికరాన్ని దిగ్గజ సాంకేతిక పరికరాల తయారీదారు శ్యామ్‌సంగ్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ‘శ్యామ్‌సంగ్ NC215’ మోడల్‌గా రూపుదిద్దుకుంటున్న సోలార్ ఆధారిత నెట్‌బుక్ విద్యుత్ శక్తితో సంబంధం లేకుండా పని చేస్తుంది. ఈ నెట్‌బుక్‌తో వినియోగదారుడు సముద్రం ఒడ్డునైనా సేదతీరుతూ ఛాటింగ్ చేసుకోవచ్చు.’’

క్లుప్తంగా ‘శ్యామ్‌సంగ్ NC215’ ఫీచర్లు:

- నెట్‌బుక్‌లో అమర్చిన ‘సోలార్ ప్యానల్’ సూర్యరశ్మిని శక్తిగా మలుచుకుంటుంది.
- నెట్‌బుక్ ఆఫ్ మోడ్‌లో సైతం ఛార్జింగ్‌కు ఉపకరిస్తుంది.
- తరచూ విద్యుత్ అంతరాయాలు చోటుచేసుకుంటున్న నేపధ్యంలో ఈ నెట్‌బుక్ అంతరాయం లేని పనితీరును వినియోగదారునికి అందిస్తుంది.
- నెట్‌బుక్‌లో అమర్చిన 1.66GHz ఆటమ్ ప్రోసెసింగ్ వ్యవస్థ పని సామర్ధ్యాన్ని మరింత సులువు చేస్తుంది.
- పొందుపరిచిన ఇంటెల్ GMA3150 గ్రాఫిక్ వ్యవస్థ నాణ్యమైన విజువల్స్‌ను అందిస్తుంది.
- 3 యూఎస్బీ 3.0 పోర్టులను నెట్‌బుక్‌లో ఏర్పాటు చేశారు.
- ‘సీడీ- డీవీడీ’ డ్రైవ్ వ్యవస్థ నెట్‌బుక్‌లో లోపించింది.
- ధర విషయాన్ని పరిశీలిస్తే ఇండియన్ మార్కెట్లో ఈ నెట్‌బుక్ రూ.17,900కు లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot