ప్రేమికుల కోసం ‘7 అంగుళాలు’...!!

Posted By: Staff

ప్రేమికుల కోసం ‘7 అంగుళాలు’...!!

శ్యామ్‌సంగ్ ప్రేమికులకు విజ్ఞప్తి.. మీ బ్రాండ్.. మీ కోసం సరికొత్త రేంజ్‌లో రాబోతుంది. గెలక్సీ 10.1, 8.9 టాబ్లెట్ల విజయోత్సాహంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న శ్యామ్‌సంగ్ అదే రిధమ్‌ను కొనసాగిస్తూ సరికొత్త ‘ 7 అంగుళాల టాబ్లెట్ పీసీ’లను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారింతంగా పనిచేసే ఈ పోర్టబుల్ సైజ్ పీసీలపై భారీ స్థాయిలో అంచానాలు నెలకున్నాయి. ఈ టాబ్లెట్ డిస్‌ప్లే సామర్థ్యాన్ని పరిశీలిస్తే AMO లెడ్ డిస్‌ప్లేతో 1024 x 600 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది.

కంపెనీ విడుదల చేసిన ప్రకటన వేరకు ‘7 అంగుళాలు టాబ్లెట్ పీసీలు’ రెండు వేరియంట్లలో రూపుదిద్దుకుంటున్నాయి. ఒక దాంట్లో వై - ఫై, 3జీ వ్యవస్థలు కలిగి ఉంటే, మరో దాంట్లో కేవలం వై - ఫై సౌకర్యాన్ని మాత్రమే పొందుపరిచారు. వినియోగదారుడు తన అవసరాలను బట్టి ఈ వేరియంట్లను ఎంపిక చేసుకోవచ్చు. ఇక పొందుపరిచిన ఫ్రంట్ (1.3 మెగా పిక్సల్), రేర్ (3 మోగా పిక్సల్) కెమెరాలు నాణ్యమైన వీడియో ఛాటింగ్‌తో పాటు మంచి ఫోటోలను ‘క్లిక్’మనిపిస్తాయి.

ఇక వినోదం విషయానికి వస్తే ఇంటిల్లిపాది ఈ టాబ్లెట్ పీసీతో పండుగ చేసుకోవచ్చు. టాబ్లెట్‌లో ముందుగానే లోడ్ చేసిన ‘మీడియా హబ్’ ఆప్లికేషన్ మీరు కోరుకున్న సినిమాలతో పాటు, టీవీ షోలను మీ ముందు ఆవిష్కృతం చేస్తుంది. అదనంగా పొందుపరిచిన ‘ఆమోజోన్ కిండ్లీ ఇ - రీడర్’ ఆప్లికేషన్ ద్వారా పుస్తకాలతో పాటు వార్తా పత్రికలను చదువుకోవచ్చు. యానిమేషన్, ఆడోబ్ ఫ్లాష్, ఎమ్‌ఎస్ ఆఫీస్ వంటి అంశాలకు సంబంధించి ముందుగానే ఆప్లికేషన్లను లోడ్ చేశారు.

పొందుపరిచిన 3.0 బ్లూటూత్, సీడీఎమ్‌ఏ 800/1900 వ్యవస్థ, డేటా ట్రాన్స్‌ఫర్‌ను వేగవంతంగా చేస్తుంది. టాబ్లెట్‌లోని ఇతర అంశాలను పరిశీలిస్తే విడీయో రికార్డింగ్, మ్యూజిక్ ప్లేయర్, గేమింగ్ ఆప్షన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సామర్ధ్యం కలిగిన బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాల మన్నికనిస్తుంది. ఇంటెర్నట్ సర్ఫింగ్ తదితరల అంశాలు వేగవంతంగా చోటుచేసుకుంటాయి. సౌకర్యవంతంగా రూపొందించిన ఈ టాబ్లెట్ పీసీనీ జేబులో పెట్టకుని వెళ్లోచ్చు. అయితే ఇంకొద్ది నెలల్లో భారతీయ మార్కెట్లోకి ఈ ‘7 అంగుళాల టాబ్లెట్ పీసీ’ రూ.8999 ధరతో లభ్యమవతుందని శ్యామ్‌సంగ్ విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot