ఆన్‌లైన్‌లో ఆ వీడియోటేప్ హంగామా!

Posted By: Super

ఆన్‌లైన్‌లో ఆ వీడియోటేప్ హంగామా!

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన లేటెస్ట్ వర్షన్ ఆపరేటంగ్ సిస్టం ‘విండోస్ 8’ను అక్టోబర్ 26న విడుదల చేస్తున్న నేపధ్యంలో

ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్ధలు

ఈ వోఎస్ ఆధారితంగా స్పందించే తమ సరికొత్త గ్యాడ్జెట్‌ల వివరాలను వీడియోల రూపంలో తీర్చిదిద్ది సామాజిక నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. దక్షిణ కొరియా సాంకేతిక దిగ్గంజ సామ్‌సంగ్ విండోస్ 8 ఆధారితంగా స్పందించే సరికొత్త హైబ్రీడ్ టాబ్లెట్-ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది. ఈ డివైజ్‌కు సంబంధించిన వీడియోను

సామ్‌‌సంగ్ తాజాగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ వీడియో టీజర్ లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన యానిమేషన్ దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఈ హైబ్రీడ్ డివైజ్‌ను ల్యాపీ అదేవిధంగా టాబ్లెట్ పీసీలా ఉపయోగించుకోవచ్చన్న అవగాహన ఈ టజర్ ద్వారా యూజర్‌కు అవగతమవుతుంది. కీబోర్డ్ డాక్, అనుసంధానించబడిన స్టైలస్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ డివైజ్‌లో ఒదిగి ఉన్నాయి. ధర ఇంకా ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

vedio url:


src="http://www.youtube.com/watch?v=sk8hNsdwbFM

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot