శ్యామ్‌సంగ్ ‘ఆర్వీ 720’, కొత్తదనం కోరుకునే వారికి మాత్రమే!!

Posted By: Staff

శ్యామ్‌సంగ్ ‘ఆర్వీ 720’, కొత్తదనం కోరుకునే వారికి మాత్రమే!!


మీ పాత ల్యాప్‌టాప్ మీద బోర్ కొట్టేసిందా..? కొత్త కాన్ఫిగరేషన్లను కోరుకుంటూ ల్యాపీని మార్చేద్దామనుకుంటున్నారా..? మంచి అభిప్రాయమే కాని కొత్తగా ఎంచుకునే ల్యాప్‌టాప్ మన్నికైనదైతే బాగుంటుంది.

దిగ్గజ సాంకేతిక పరికరాల తయారీ దారైన శ్యామ్‌సంగ్ ‘ఆర్వీ 720’ పేరుతో ఓ సరికొత్త ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో విడుదల చేసింది. స్టైలిష్ గ్యాడ్జెట్ల సరసన చేరిన ఈ స్టన్నింగ్ ల్యాపీ పరికరం కొత్తదనం కోరుకునే వారికి మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది.

క్లుప్తంగా ‘ఆర్వీ 720’ స్పెసిఫికేషన్లు:

- గన్‌మెంటల్ గ్రే కలర్ కలిగి 17 వైడర్ సైజుల్లో ఈ ల్యాపీ లభ్యమవుతుంది.
- అత్యుత్తమంగా డిజైన్ చేయబడ్డ కీ ప్యాడ్లు సులువైన టైపింగ్‌కు అనువుగా ఉంటాయి.
- టచ్‌ప్యాడ్ల భాగంలో ఫ్లాషింగ్ లైట్లను అమర్చారు.
- 17.3 అంగుళాల డిస్ ప్లే, 1,600 x 900 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది.
- ఇంటెల్ హెచ్‌డీ 3000 గ్రాఫిక్ ప్రోసెసింగ్ వ్యవస్థను ల్యాపీలో పొందుపరిచారు.
- ఇంటెల్ కోర్ i3-2310ఎమ్ ప్రొసెసర్, 2.1 GHz క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది.
- స్టోరేజి సామర్ధ్యం 750 జీబీ, ఎక్సటర్నల్ మెమరీ సపోర్ట్ 8జీబీ.
- 3 యూఎస్బీ పోర్టులు వేగవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థకు సహకరిస్తాయి.
- అత్యాధునిక బ్లూటూత్ వ్యవస్థ డేటా ట్రాన్స్‌ఫర్ విషయంలో వేగవంతంగా స్పందిస్తుంది.
- మన్నికైన బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలిక బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
- డీవీడీ రైటర్ వ్యవస్థ మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది.
- మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2010 కొత్త ఎడిషన్‌ను ల్యాపీలో ప్రవేశపెట్టారు.
- ఒక సంవత్సరం వారంటీతో ‘శ్యామ్ సంగ్ RV 720’ రూ.24,500లకు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot