సెప్టంబర్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ గ్లాస్!

|

ప్రపంచపు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ మరో విప్లవాత్మమైన ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. గూగుల్ గ్లాస్‌కు పోటీగా తన సొంత వర్షన్ గెలాక్సీ గ్లాస్‌ను సామ్‌సంగ్ వృద్ధి చేస్తున్నట్లు కొరియా టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది. సామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ ఈ వివరాలను వెల్లడించినట్లు సదరు మీడియా పేర్కొంది.

 
సెప్టంబర్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ గ్లాస్!

సామ్‌సంగ్ గెలాక్సీ గ్లాస్‌గా పేర్కొనబడుతున్న ఈ స్మార్ట్ గ్లాస్ కంప్యూటింగ్ డివైస్‌ను బెర్లిన్ వేదికగా సెప్టంబర్‌లో నిర్వహించే ఐఎఫ్ఏ 2014లో ఆవిష్కరించే అవకాశముందని సామ్‌సంగ్ ఎగ్జిక్యూటివ్ సదరు మీడియాలకు తెలిపారు. 2013 ఐఎఫ్ఏ ఎగ్జిబిషన్‌లో సామ్‌సంగ్ తన మొట్ట మొదటి స్మార్ట్‌వాచ్ గేలాక్సీ‌ గేర్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాము రూపొందించిన కాన్సెప్ట్ స్మార్ట్‌ గ్లాస్ కొత్త కమ్యూనికేషన్ సంస్కృతికి తెరలేపుతుందని సదరు ఎగ్జిక్యూటివ్ కొరియా టైమ్స్‌తో అన్నారు.

గూగుల్ గ్లాస్ ఓ కొత్త ఒరవడి!

గూగుల్ సంస్థ వినూత్న ఆవిష్కరణ ‘గూగుల్ గ్లాస్'. ఈ టెక్నాలజీ ప్రపంచానికే సరికొత్త ఒరవడి. ఈ గ్లాస్ ఆధారంగా వీడియో చాటింగ్.. మెసేజింగ్.. వెబ్ బ్రౌజింగ్ ఇలా అనేక ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఈ కళ్లద్దాలతో ఫోటోలను సైతం చిత్రీకరించుకోవచ్చు. వీడియోలను సైతం రికార్డ్ చేసుకోవచ్చు. ఈ రియాలిటీ గ్లాసెస్ ఆధారంగా ఆచూకీలను సైతం కనుగొనవచ్చు. వీటి తయారీకి గూగుల్ రెండేళ్ల పాటు శ్రమించింది.

స్మార్ట్‌ఫోన్ తరహలో వాయిస్ కమాండ్‌లకు గూగుల్ గ్లాస్ సహకరిస్తుంది. గూగుల్ గ్లాస్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. గూగుల్ గ్లాస్ సాయంతో చేతులతో పనిలేకుండా ఫోటో చిత్రీకరించటంతో పాటు వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. గూగుల్ గ్లాస్ ద్వారా ఆన్‌లైన్ శోధనలు సులువుగా నిర్వహించుకోవచ్చు.

గూగుల్ గ్లాస్ బుల్ట్ ఇన్ కెమెరా, స్పీకర్ టెక్నాలజీతో కూడిన మైక్రోఫోన్ ఫీచర్లను కలిగి ఉంది. వైర్‌లెస్ కనెక్షన్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను సులువుగా సింక్ చేసుకోవచ్చు. గూగుల్ గ్లాస్‌లు 5 కలర్ వేరియంట్‌లలో లభ్యం కానున్నాయి. గూగుల్ గ్లాస్ ప్రాజెక్ట్ 2010లో ప్రారంభమైంది. గూగల్ కళ్లద్దాల ద్వారా చిత్రీకరించబడిన పలు ఆసక్తికర ఫోటోలను తిలకించేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X