మార్కెట్లోకి సామ్‌సంగ్ సిరీస్5 అల్ట్రాటచ్ నోట్‌బుక్!

Posted By: Super

మార్కెట్లోకి సామ్‌సంగ్ సిరీస్5 అల్ట్రాటచ్ నోట్‌బుక్!

 

సౌత్ కోరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ మంగళవారం దేశీయ విపణిలో రెండు విండోస్ 8 టాబ్లెట్‌లతో పాటు సిరీస్ 5 అల్ట్రాటచ్ నోట్‌బుక్‌ను ఆవిష్కరించింది. విండోస్ ఆధారితంగా స్పందించే అల్ట్రాటచ్ నోట్‌బుక్ ధర రూ.64,990. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే...

- ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.7గిగాహెడ్జ్),

-13.3 అంగుళాల టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1366× 768పిక్సల్స్),

- 8జీబి డీడీఆర్3 ర్యామ్,

- 500జీబి హార్డ్ డ్రైవ్,

- 4 సెల్ బ్యాటరీ (బ్యాకప్ 6.5 గంటలు),

- హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్, యూఎస్బీ 3.0 పోర్ట్, యూఎస్బీ 2.0 పోర్ట్, ఆల్-ఇన్-వన్ కార్డ్ రీడర్.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఏఎమ్‌డి క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో కూడిన అప్‌గ్రేడెడ్ వర్షన్ సిరీస్5 అల్ట్రాబుక్‌ను సామ్‌సంగ్ ప్రవేశపెట్టింది. ధర రూ.43,990. అంతే కాకుండా, విండోస్ 8 వర్షన్ సిరీస్ 9 నోట్‌బుక్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ధర రూ.107,990.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot