ఉత్తమ కంప్యూటింగ్... ఉత్తమ ఎంపిక!!

స్మార్ట్‌ఫోన్స్ అదే మాదిరిగా టాబ్లెట్ కంప్యూటర్ల నిర్మాణ రంగంలో అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న బ్రాండ్ శామ్‌సంగ్. తాజాగా ఈ కంపెనీ సిరీస్ 5 నుంచి 14 అంగుళాల మానిటర్‌తో కూడిన అల్ట్రాబుక్‌ను మార్కెట్లో లాంఛ్ చేసింది. ఉన్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ శక్తివంతమైన ఫీచర్లను ఒదిగి ఉంది.
ఫీచర్లు:
విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ కోర్ ఐ5 2467ఎమ్ ప్రాసెసర్ (1.6జిగాహెడ్జ్ సామర్ధ్యం), ఇంటెల్ హెచ్‌ఎమ్65 మదర్ బోర్డ్ చిప్‌సెట్,
14 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఏఎమ్‌డి రాడియన్ హె డెఫినిషన్ 7550 ఎమ్ గ్రాఫిక్స్ హార్డ్‌వేర్, 500జీబి హార్డ్‌డ్రైవ్, క్వాలిటీ వెబ్‌క్యామ్, సబ్ ఊఫర్ సిస్టం,
6జీబి మెమెరీ, వై-పై, బ్లూటూత్, హెచ్‌డిఎమ్‌ఐ కనెక్టువిటీ, 6144ఎంబీ ర్యామ్.
అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో రూపుదిద్దుకున్న ఈ ల్యాపీ మెరుగైన ఫలితాలను రాబుడుతుంది. ఏర్పాటు చేసిన కీబోర్డు, స్ర్కోలింగ్ టచ్‌ప్యాడ్ వంటి అంశాలు మరింత సౌకర్యవంతంగా పనిచేస్తాయి. నాజూకైన శైలిలో డిజైన్ కాబడిన ఈ పోర్టబుల్ ల్యాపీ ఆప్టికల్ డ్రైవ్‌లతో పాటు హార్డ్‌డిస్క్ డ్రైవ్‌లను సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న 14 అంగుళాల ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే శామ్‌సంగ్ సిరీస్ 5 ధర కాస్త ఎక్కువ. ఇండియన్ మార్కెట్లో శామ్‌సంగ్ సిరీస్ 5 అల్ట్రాబుక్ విలువ రూ. 55,000.


Click it and Unblock the Notifications








