క్వాలిటీ కంప్యూటింగ్!!

Posted By: Super

 క్వాలిటీ కంప్యూటింగ్!!

 

స్మార్ట్‌ఫోన్స్ అదే మాదిరిగా టాబ్లెట్ కంప్యూటర్ల నిర్మాణ రంగంలో అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న బ్రాండ్ శామ్‌సంగ్. తాజాగా ఈ కంపెనీ సిరీస్ 5 నుంచి 14 అంగుళాల మానిటర్‌తో కూడిన అల్ట్రాబుక్‌ను మార్కెట్లో లాంఛ్ చేసింది. ఉన్నత  ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ శక్తివంతమైన ఫీచర్లను ఒదిగి ఉంది.

ఫీచర్లు:

*   విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,

*   ఇంటెల్ కోర్ ఐ5 2467ఎమ్ ప్రాసెసర్ (1.6జిగాహెడ్జ్ సామర్ధ్యం),

*   ఇంటెల్ హెచ్‌ఎమ్65 మదర్ బోర్డ్ చిప్‌సెట్,

* 14 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే,

*   ఏఎమ్‌డి రాడియన్ హె డెఫినిషన్ 7550 ఎమ్ గ్రాఫిక్స్ హార్డ్‌వేర్,

* 500జీబి హార్డ్‌డ్రైవ్,

*   క్వాలిటీ వెబ్‌క్యామ్,

*   సబ్ ఊఫర్ సిస్టం,

*  6జీబి మెమెరీ,

*  వై-పై,

*  బ్లూటూత్,

*  హెచ్‌డిఎమ్‌ఐ కనెక్టువిటీ,

* 6144ఎంబీ ర్యామ్.

అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో రూపుదిద్దుకున్న ఈ ల్యాపీ మెరుగైన ఫలితాలను రాబుడుతుంది. ఏర్పాటు చేసిన కీబోర్డు, స్ర్కోలింగ్ టచ్‌ప్యాడ్ వంటి అంశాలు మరింత సౌకర్యవంతంగా పనిచేస్తాయి. నాజూకైన శైలిలో డిజైన్ కాబడిన ఈ పోర్టబుల్ ల్యాపీ ఆప్టికల్ డ్రైవ్‌లతో పాటు హార్డ్‌డిస్క్ డ్రైవ్‌లను సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న 14 అంగుళాల ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే శామ్‌సంగ్ సిరీస్ 5 ధర కాస్త ఎక్కువ. ఇండియన్ మార్కెట్లో శామ్‌సంగ్ సిరీస్ 5 అల్ట్రాబుక్ విలువ రూ. 55,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot