‘శ్యామ్‌సంగ్’ఆ పని ఎందుకు చేసింది..?

టెలివిజన్ టెక్నాలజీని వినియోగించి పర్సనల్ కంప్యూటర్ ను శ్యామ్‌సంగ్ డిజైన్ చేసింది. ‘సిరీస్ 7 AIO PC’వర్షన్ గా రూపుదిద్దుకున్న ఈ పీసీ వినియోగదారులకు కొత్త తరహా అనుభూతిని రుచిచూపిస్తుంది. తక్కువ స్థలాన్ని ఆక్రమించే ఈ సరికొత్త కంప్యూటర్ పరికరం 23 అంగుళాల వైడర్ స్ర్కీన్ కలిగి టచ్ స్ర్కీన్ సౌలభ్యతతో రూపుదిద్దుకుంది. డిస్ ప్లేలో పొందుపరిచిన LED హై డెఫినిషన్ టెక్నాలజీ వ్యవస్థ చూపరులను కొత్త అనుభూతులకు లోను చేస్తుంది.
క్లుప్తంగా ఫీచర్లు:
- విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ వ్యవస్థను పీసీలో లోడ్ చేశారు.
- శక్తివంతమైన ఇంటెల్ కోర్ i3-2120T ప్రాసెసర్ వేగవంతమైన పనితీరు కలిగి ఉంటుంది.
- ఇంటెల్ హెచ్ డీ గ్రాఫిక్ వ్యవస్థ నాణ్యమైన విజువల్స్ ను విడుదల చేస్తుంది.
- ఈ పీసీలో గ్యేమింగ్ అనుభూతి కొత్త లోకాల్లో విహరింప చేస్తుంది.
- పీసీలో పొందుపరిచిన 1000జీబీ స్టోరేజి సామర్ధ్యం వినియోగదారుడికి మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది.
- నాణ్యమైన సౌండ్ వ్యవస్థ పీసీకి ప్రత్యేక ఆకర్షణ, అత్యాధునిక 8W స్టీరియో స్పీకర్లను పీసీలో అమర్చారు. ఎక్సటర్నల్ కనెక్టువిటీకి సంబంధించి యూఎస్బీ 2.0, యూఎస్బీ 3.0 పోర్టులను పీసీలో పొందుపరిచారు.
- పీసీలో ఏర్పాటు చేసిన డ్యూయల్ లేయర్ డీవీడీ ప్లేయర్ వ్యవస్థ డీవీడీలను రైట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
-‘శ్యామ్‌సంగ్ సిరీస్ 7 AIO PC’మార్కెట్ ధర రూ.46,700.


Click it and Unblock the Notifications








