ఆ సత్తా మాకుంది..?

Posted By: Staff

ఆ సత్తా మాకుంది..?

 

కంప్యూటింగ్ పరికరాల వ్యాపారంలో తిరుగులేని హవాని కొనసాగిస్తున్న ‘శ్యామ్‌సంగ్’ ఎంతటి గట్టిపోటీనైనా ఎదుర్కొనేందుకు ‘సై’ అంటూ సవాల్ విసురుతుంది. తాజాగా ఈ దిగ్గజ బ్రాండ్ విడుదల చేసిన ‘సిరీస్ 7 క్రోనోస్ 700Z5A’ ల్యాప్‌టాప్, అగ్రగామి ‘మ్యాక్ బుక్ ప్రో’కు ధీటుగా నిలవనుంది.

‘శ్యామ్ సంగ్ సిరీస్ 7 క్రోనోస్ 700Z5A’ ఫీచర్లను పరిశీలిస్తే 15.6 అంగుళాల హై రిసల్యూషన్ మ్యాట్ స్క్ర్రీన్ వినియోగదారుడికి మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. ఏర్పాటు చేసిన 1GB రాడియన్ HD 6750M గ్రాఫిక్ కార్డ్ వ్యవస్థ మన్నికైన గ్రాఫిక్ విజువల్స్‌ను విడుదల చేస్తుంది. 750GB HDD, 8GB SSD స్టోరేజి వ్యవస్థలు పటిష్ట పనితీరును కలిగి ఉంటాయి.

కోర్ i7, కోర్ i5 క్వాడ్ కోర్ సీపీయూ వర్షన్లలో ఈ ల్యాపీ లభ్యమవుతుంది. ఏర్పాటు చేసిన చిక్ లెట్ కీబోర్డు వ్యవస్థ సౌకర్యవంతమైన టైపింగ్‌కు ఉపకరిస్తుంది. స్లీక్ ప్రొఫైల్ కలిగి ఉన్న ఈ 700Z5A నిర్మాణంలో మన్నికైన ఆల్యూమినియం పదార్ధాన్ని వినియోగించటంతో పాటు బ్రషుడ్ మెటల్ అప్పిరియన్స్‌ను కల్పించారు.

యూఎస్బీ 3.0, 2.0 పోర్ట్సు, హెచ్డీఎమ్ఐ పోర్టు, SDXC కార్డ్ రీడర్, జిగాబిట్ ఇతర్‌నెట్ పోర్టు, DVD రీరైటర్ స్లాట్ రీడర్, బ్లూటూత్ 3.0, వై-ఫై వంటి కనెక్టువిటీ అంశాలు కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత వేగవంతం చేస్తాయి. పటిష్ట బ్యాటరీ వ్యవస్థ ధీర్ఘకాలిక బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

కోర్ i7 క్రోనోస్ 700Z5A పనితీరు వినియోగదారులను మరింత ఆకట్టుకుంటుందని శ్యామ్‌సంగ్ అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. భారతీయ మార్కెట్లో ‘శ్యామ్‌సంగ్ సిరీస్ 7 క్రోనోస్ 700Z5A’ ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధర రూ.45,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot