ఆ కాంభినేషన్‌తో జనంలోకి.. ఫలితం ఏలా ఉండబోతుందో?

Posted By: Prashanth

ఆ కాంభినేషన్‌తో జనంలోకి.. ఫలితం ఏలా ఉండబోతుందో?

 

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రియుల అభిమానాన్ని చొరగుంటున్న సామ్‌సంగ్ మరోసారి ఉవ్వెత్తున ఎగసేందుకు సిద్ధమవుతోంది. ఏడాది ఆరంభంలో ఈ దిగ్గజ బ్రాండ్ ప్రకటించిన సిరీస్ 9 ల్యాప్‌టాప్లు మార్కెట్ వర్గాల్లో వేడి పుట్టించిన విషయం తెలిసిందే. ఈ ల్యాపీల్లో ఒదిగి ఉన్న సొగసైన రూపకల్పన, అత్యుత్తమ పనితీరు వంటి విశేషాలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి.

సామ్‌సంగ్, శక్తివంతమైన ఐవీ బ్రిడ్జ్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో కూడిన సిరీస్ 7 గేమింగ్ ల్యాప్‌టాప్‌లను రూపొందించింది. తరువాత వరసలో ఉన్న సిరీస్ 9 ల్యాపీలలో సైతం ఈ మూడవ జనరేషన్ ప్రాసెసర్లను నిక్షిప్తం చేస్తునట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సామ్‌సంగ్, ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్ల కలయిక పై అంచనాలు రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి.

సామ్‌సంగ్ సిరీస్ 9 ల్యాప్‌టాప్‌లలోని కీలక ఫీచర్లు:

- ఐవీ బ్రిడ్జ్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్,

- విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,

- 1.3 మెగా పిక్సల్ వెబ్‌క్యామ్,

- హై డెఫినిషన్ ఆడియో,

- 4 వాట్ స్టీరియో స్పీకర్స్,

- ఇంటెల్ హై డెఫినిషన్ 4000 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

- ఇంటెల్ హెచ్ఎమ్75 చిప్ సెట్

- ఇతర్‌నెట్ డాంగిల్ బండిల్,

- 128జబి ఎస్ఎస్‌డి డ్రైవ్,

- 8జీబి డీడీఆర్3 సిస్టం మెమెరీ,

ముఖ్యంగా నాజూకైన డిజైనింగ్ మరింత స్టైలిష్‌గా ఉంటుంది. ఉత్తమ పిక్సల్ రిసల్యూషన్ కలిగిన స్ర్కీన్‌లు మన్నికైన విజువల్ అనుభూతికి లోను చేస్తాయి. నిక్షిప్తం చేసిన ఇంటెల్ మూడవ జనరేషన్ ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్ ల్యాపీల పనితీరును మరింత వేగవంతం చేస్తాయి. ఏర్పాటు చేసిన హై డెఫినిషన్ వెబ్‌క్యామ్ ద్వారా ప్రత్యక్ష ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు. పొందపరిరచిన గ్రాఫిక్ ప్రాసెసింగ్ ఉత్తమ శ్రేణి అనుభూతులను యూజర్‌కు చేరువచేస్తాయి. వీటి మోడళ్లు ఇతర ధరలకు సంబంధించిన వివరాలు వెల్లడికావల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot