ఫబ్రవరిలో నిర్వహించే గాడ్జెట్ ఉత్పత్తుల ప్రదర్శన ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ - 2013'కు సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ సమాయుత్తమవుతున్న నేపధ్యంలో ఓ ఆసక్తికర వార్త సామ్‌సంగ్ ట్యాబ్లెట్ అభిమానులను ఊరిస్తుంది. మన్నికతో కూడిన చవక ధర ట్యాబ్లెట్ కంప్యూటింగ్‌ను భారతీయలకు చేరువచేసే క్రమంలో ‘ట్యాబ్ 2 311' పేరుతో రూ.13,900 ధరలో ఓ సరికొత్త ట్యాబ్లెట్‌ను సామ్‌సంగ్ అందుబాటులోకి తీసుకురానుంది. సామ్‌సంగ్ ఇండియా అధికారిక ఈ-స్టోర్‌లో ఇప్పటికే ప్రీ-ఆర్డర్ పై లభ్యమవుతున్న ‘ట్యాబ్ 2 311' ఫిబ్రవరి మొదటి వారంలో మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇండియన్ వర్షన్ ప్రకారం ‘ట్యాబ్ 2 311'గా పేర్కొనబడుతున్న సామ్ సంగ్ ట్యాబ్ 2 7.0 (గ్లోబల్ వర్షన్)ను తొలిగా ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ - 2012'లో ఆవిష్కరించారు. స్పెసిఫికేషన్‌లు: