2012లో శ్యామ్‌సంగ్ సరికొత్త టాబ్లెట్ పీసీ!!

Posted By: Prashanth

2012లో శ్యామ్‌సంగ్ సరికొత్త టాబ్లెట్ పీసీ!!

 

కంప్యూటింగ్ మరియు మొబైల్ మార్కెట్లో సుపరిచితమైన ‘శ్యామ్‌సంగ్’ సరికొత్త ఆవిష్కరణకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. 2012 ఫిబ్రవరిలో సరికొత్త టాబ్లెట్ పీసీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ కాబుడుతున్న ఈ కంప్యూటింగ్ పీసీ పేరు తెలియాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఫీచర్లు:

- 11.6 అంగుళాల స్ర్కీన్,

- అత్యాధునిక రెటినా సామర్ధ్యం గల డిస్ ప్లే.

- పిక్సల్ రిసల్యూషన్ 2560 x 1600,

- అత్యాధునిక ఐస్ క్రీమ్ శాండ్‌‌విచ్ ఆపరేటింగ్ వ్యవస్థ,

- ఆండ్రాయిడ్ బీమ్ ఫీచర్,

- శక్తివంతమైన శ్యామ్‌సంగ్ ఎక్సినోస్ ప్రాసెసింగ్ వ్యవస్థ,

- క్లాక్ స్పీడ్ 2GHz,

- హై -డెఫినిషన్ సామర్ధ్యం.

లెటెస్ట్ స్సెసిఫికేషన్లతో శ్యామ్‌సంగ్ ప్రవేశపెట్టబోతున్న సరికొత్త టాబ్లెట్ పీసీ, మునుపటి మోడల్ శ్యామ్‌సంగ్ గెలక్జీ ట్యాబ్‌ను మించుతుందో లేదో చూడాలి మరి. విడుదలకు ముందే మార్కెట్లో ఉత్కంఠ రేపుతున్న ఈ టాబ్లెట్ పీసీ ధర ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot