శామ్‌సంగ్ డిజిటల్ అద్భుతం!!

Posted By:

 

 

శామ్‌సంగ్ డిజిటల్ అద్భుతం!!

 

డిజిటల్ ప్రపంచంలో మరో అద్భుతానికి శామ్‌సంగ్ శ్రీకారం చుట్టింది. డిజిటల్ పాఠ్య పుస్తకాలను వీక్షించటంతో పాటు వీడియో ప్రసంగాలను వినేందుకుగాను ‘లెర్నింగ్ హబ్’ అనే డిజిటల్ టెక్నాలజీ వ్యవస్థను శామ్‌సంగ్ తన సరికొత్త టాబ్లెట్ పీసీలలో ప్రవేశపెట్టనుంది.  త్వరలో విడుదల కానున్న గెలక్సీ ట్యాబ్ 10.1, గెలక్పీ ట్యాబ్ 8.9 LTE డివైజ్‌లలో ఈ ఆధునిక టెక్నాలజీని పొందపరచనున్నారు. ఈ వ్యవస్థ సాయంతో  టాబ్లెట్‌లోకి 6,000 పాఠ్య పుస్తకాలను వినియోగదారుడు యాక్సిస్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఉపయుక్తమైన వీడియో ప్రసంగాలును వినవచ్చు. విద్యార్థులకు ఈ కొత్త  డిజిటల్ పరిజ్ఞానం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఆమెజాన్, ఆపిల్ వంటి దిగ్గజ శ్రేణి బ్రాండ్లు ఇప్పటికే ఈ తరాహా డిజిటల్ టెక్నాలజీ పై కన్నేశాయి. బార్సిలోనోలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదిక పై ‘లెర్నింగ్ హబ్’ను ప్రతిష్టాత్మకంగా  లాంఛ్ చేయునున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot