ఈ కలయిక టాబ్లెట్ ప్రపంచంలో కొత్త అధ్యయానికి నాంది..

Posted By: Super

ఈ కలయిక టాబ్లెట్ ప్రపంచంలో కొత్త అధ్యయానికి నాంది..

కొరియా ఎకనమిక్ డైలీ అందించిన సమాచారం ప్రకారం విండోస్ సిఈవో స్టీవెన్ చెప్పిన మాటలు ఏంటంటే విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి శ్యామ్‌సంగ్ టాబ్లెట్‌ని వచ్చే వారం కాలిఫోర్నియాలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొట్టమొదటసారి శ్యామ్‌సంగ్ కంపెనీ మైక్రోసాప్ట్ టెక్నాలజీతో కలసి ప్రోడక్ట్‌ని విడుదల చేయడంతో దీనిని ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకుంది. టాబ్లెట్ మార్కెట్లో ఈ టాబ్లెట్ విడుదలైన వెంటనే ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని శ్యామ్‌సంగ్ ప్రతినిధులు తెలిపారు.

శ్యామ్‌సంగ్ విండోస్ 8 టాబ్లెట్స్ ARM ప్రాసెసర్‌తో రన్ అవ్వడం వల్ల హై ఫెర్పామెన్స్‌ని డెలివరి చేస్తాయి. గతంలో శ్యామ్‌సంగ్ టాబ్లెట్స్‌లలో Nvidia, Qualcomm or Texas ప్రాసెసర్స్‌ని నిక్షిప్తం చేయడం జిరిగేది. ఇప్పుడు విండోస్ 8 టాబ్లెట్స్‌లో నిక్షిప్తం చేసిన ఈ ప్రాసెసర్ స్పెషాలిటీ ఏమిటంటే వీటిల్లో పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ని చక్కగా అందిస్తాయి. ఈ విషయంలో శ్యామ్‌సంగ్ తయారీదారులు ముందుగానే ARM ప్రాసెసర్‌ గురించి యూజర్స్ కు తెలియజేశారు. శ్యామ్‌సంగ్ స్మార్ట్ పోన్స్‌కి ARM ప్రాసెసరే సరైనదని అభివర్ణించారు.

మైక్రో విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌ని టాబ్లెట్స్‌లో ఉపయోగించడం వల్ల యూజర్స్‌కి కొత్త ఫీచర్స్‌ని అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది.అంతేకాకుండా విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వాలంటే హార్డ్ వేర్ రిక్వైర్‌మెంట్స్ ఏమేమి ఉండాలో వాటన్నింటిని ఈ టాబ్లెట్లో పొందుపరచడం జరిగింది. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌ను పూర్తిగా చెక్ చేసి మరీ ఇందులో పోందుపరచడం జరుగుతుంది. అంతేకాకుండా విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతి ఒక్క అప్లికేషన్‌కి కూడా సరిపోతుంది.

శ్యామ్‌సంగ్ ఈ విండోస్ 8 టాబ్లెట్‌ని మార్కెట్లోకి విడుదల చేయడం కొంత మంది తయారీ దారులకు ఇబ్బందికరంగా మారింది. ఇందుకు కారణం ఇప్పటికే శ్యామ్‌సంగ్ విండోస్ 8 టాబ్లెట్‌పై మార్కెట్లో మంచి రిపోర్ట్స్ రావడమే. శ్యామ్‌సంగ్ ఈ విండోస్ 8 టాబ్లెట్‌‌ని విడుదల చేసిన తర్వాత మెజారిటీ టాబ్లెట్ షేర్‌ని కూడా సొంతం చేసుకుంటుందని కంప్యూటర్ నిపుణులు భావిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot