ఆపిల్ ఆధిపత్యానికి మరో కళ్లెం..?

ఆపిల్‌ను ఆధిపత్యాన్ని అధిగమించే క్రమంలో శామ్‌సంగ్ మరో అస్త్రాన్ని సిద్దం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రెటీనా డిస్‌ప్లేతో రూపుదిద్దుకున్న ఆపిల్ కొత్త ఐప్యాడ్‌కు పోటీగా ఎస్‌ప్రెస్సో7, ఎస్‌ప్రెస్సో 10 వేరియంట్‌లలో రెండు టాబ్లెట్ కంప్యూటర్లను బరిలోకి దింపేందుకు శామ్‌సంగ్ సన్నాహాలు చేస్తుంది. వీటి విడుదల ఈ జూన్‌లో ఉండే అవకాశముంది. అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న ఈ డివైజులను శామ్‌సంగ్ టెలివిజన్ సెట్లకు అనుసంధానించుకునే సౌలభ్యత ఉంటుంది.
కొత్త ఐప్యాడ్‌కు ఓ సవాల్‌గా నిలిచే విధంగా ఈ టాబ్లెట్‌లలో ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటంగ్ సిస్టం, క్వాడ్‌కోర్ Exynos ప్రాసెసర్ అదేవిధంగా హై పిక్సల్‌తో కూడిన హైడెఫినిషన్ స్ర్కీన్‌లను ఏర్పాటు చేసినట్లు వినికిడి. ఈ గ్యాడ్జెట్ల స్పెసిఫికేషన్‌లకు సంబంధించి అధికారికంగా ఏ విధమైన సమచారం లేదు. ఆధునిక హంగులతో విడుదలకు ముస్తాబవుతున్న ఎస్‌ప్రెస్సో 10, ఆపిల్ కొత్త ఐప్యాడ్‌కు గొప్ప పోటీ ఇవ్వగలదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇండస్ట్రీలో షికారు చేస్తున్న ఈ రూమర్ పై శామ్‌సంగ్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications