టాప్‌‌ ప్లేస్ పై కన్నేసిన మెగా ఫ్యామిలీ!

Posted By: Super

టాప్‌‌ ప్లేస్ పై కన్నేసిన మెగా ఫ్యామిలీ!

ఆపిల్‌ను అధిగమించే క్రమంలో శామ్‌సంగ్ మరిన్ని అస్త్రాలను సిద్దం చేసినట్లు ప్రచారం సాగుతోంది. రెటీనా డిస్‌ప్లేతో రూపుదిద్దుకున్న ఆపిల్ కొత్త ఐప్యాడ్‌కు పోటీగా ఎస్‌ప్రెస్సో7, ఎస్‌ప్రెస్సో 10 వేరియంట్‌లలో రెండు టాబ్లెట్ కంప్యూటర్లను బరిలోకి దింపేందుకు శామ్‌సంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ జూన్ లోనే వీటిని విడుదల చేసే అవకాశముంది. అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ డివైజులను శామ్‌సంగ్ టెలివిజన్ సెట్లకు అనుసంధానించుకోవచ్చుట.

కొత్త ఐప్యాడ్‌కు గట్టి పోటీనిచ్చేవిధంగా ఎస్‌ప్రెస్సో టాబ్లెట్‌లలో ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటంగ్ సిస్టం, క్వాడ్‌కోర్ Exynos ప్రాసెసర్ అదేవిధంగా హై పిక్సల్‌తో కూడిన హైడెఫినిషన్ స్ర్కీన్‌లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ గ్యాడ్జెట్ల స్పెసిఫికేషన్‌లకు సంబంధించి అధికారికంగా ఏ విధమైన సమచారం లేదు. ఇండస్ట్రీలో షికారు చేస్తున్న ఈ రూమర్ పై శామ్‌సంగ్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot