అభిమానుల కోసం, ఈ వారంలోనే...?

Posted By: Prashanth

అభిమానుల కోసం, ఈ వారంలోనే...?

 

మెగా బ్రాండ్ సామ్‌సంగ్ తన గెలాక్సీ లైన‌ప్‌ను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా, ఆ సిరీస్ నుంచి అనేక ఉత్పత్తులను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సిరీస్ నుంచి ఇటీవల రూపుదిద్దుకున్న ‘గెలాక్సీ ట్యాబ్ 2 ఆకా టాబ్ 310’టాబ్లెట్ ఈ వారం విడుదల కాబోతుంది. ఈ గ్యాడ్జెట్‌కు సంబంధించిన వివరాలను తొలిగా ఫిబ్రవరిలో నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ద్వారా వెల్లడించారు.

టాబ్లెట్ ప్రధాన ఫీచర్లు:

- 7 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

- 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

- 1 జీబి డీడీఆర్ 2 ర్యామ్,

- 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

- వీజీఏ ఫ్రంట్ కెమెరా,

- జీపీఎస్ సపోర్ట్,

- రష్యన్ గ్లోనాస్ ట్రాకింగ్ సిస్టం,

- 3జీ కనెక్టువిటీ,

- HSPA+ కనెక్టువిటీ,

- ధర రూ.20,000.

ట్యాబ్ 310లో పొందుపరిచిన స్పెసిఫికేషన్‌లు ఉన్నతమైన పనితీరును కనబరుస్తాయి. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆఫరేటింగ్ సిస్టం సౌకర్యవంతమైన కంప్యూటింగ్‌కు సహకరిస్తుంది. 1 గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ వేగవంతమైన ప్రాసెసింగ్‌ను అందిస్తుంది. 1జీబి డీడీఆర్2 ర్యామ్ సులభతరమైన మల్టీటాస్కింగ్‌ను చేరువచేస్తుంది. 3జీ, HSPA+ కనెక్టువిటీల సాయంతో వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందుకోవచ్చు. 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే మన్నికైన విజువల్ అనుభూతులను చేరువచేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot