తెరపైకి డబల్ స్టోరీ!!

Posted By: Prashanth

తెరపైకి డబల్ స్టోరీ!!

 

గెలక్సీ సిరీస్ నుంచి అనేక వేరియంట్‌లలో టాబ్లెట్ పీసీలను రూపొందించిన సామ్‌సంగ్ వినూత్న తరహా ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. డ్యూయల్ స్ర్కీన్ టాబ్లెట్ పీసీ తయారు చేసే పనిలో ఈ దిగ్గజం నిమగ్నమైంది. ఈ డివైజ్ డిజైనింగ్‌కు సంబంధించి సామ్‌సంగ్ పేటెంట్ దాఖలు చేసినట్లు తెలిసింది. రిమోట్ కంట్రోల్ వ్యవస్థ డివైజ్‌కు మరో ఆకర్షణగా నిలవనుంది. ఈ తరహా డ్యూయల్ స్ర్ర్కీన్ టాబ్లెట్ పీసీని తోషిబా రూపొందించింది. పేరు లైఫ్‌టైమ్ నోట్‌బుక్.

తోషిబాను అనుసరిస్తూ ఏసర్ ఐకోనియా 6120 మోడల్ పేరుతో డ్యూయల్ టచ్ స్ర్కీన్ నోట్‌బుక్‌ను విడుదల చేసింది. వీరి జాబితాలో చేరిన సోనీ టాబ్లెట్ ‘పీ’ పేరుతో 5.5 అంగుళాల టచ్ స్ర్కీన్‌తో కూడిన డ్యూయల్ స్ర్కీన్ గ్యాడ్జెట్‌ను డిజైన్ చేసింది. సామ్‌సంగ్ రూపొందిస్తున్న సరికొత్త డ్యూయల్ సిమ్ టాబ్లెట్ పెద్దవైన డిస్‌ప్లే స్ర్కీన్‌లను కలిగి ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలో విడుదలై డ్యూయల్ స్ర్కీన్ టాబ్లెట్లు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot