అమెరికా నుంచి ప్రయత్నాలు?

Posted By: Prashanth

అమెరికా నుంచి ప్రయత్నాలు?

 

పోటీ ల్యాప్‌టాప్‌ల మార్కెట్లో తన స్థానాన్ని సుస్ధిరపరుచుకునేందుకు డెల్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజగా ఈ బ్రాండ్ సాండీబ్రిడ్జ్ ప్రాసెసర్‌తో శక్తివంతమైన అల్ట్రాబుక్‌ను డిజైన్ చేసింది. ఇన్స్‌ఫిరాన్ సిరీస్ నుంచి వస్తున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ పేరు 14Z.డివైజ్ శాండీబ్ర్రిడ్జ్ ప్రాసెసర్‌ను కలిగి ఉన్నప్పటికి త్వరలో ఐవీ బ్రిడ్జ్‌కు మారిపోవచ్చు.

మధ్య తరగతి విభాగాలకు అనువుగా రూపొందించబడిన ఈ ల్యాపీ యూఎల్‌వీ సాండీ‌బ్రిడ్జ్ కోర్ ఐ3 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. గ్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఇంటెల్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌ను లోడ్ చేశారు. ఈ విభాగాన్ని రాడియన్ హైడెఫినిషన్ 7570Mకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 14 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్ 1366 × 768పిక్సల్ రిసల్యూషన్‌ను కలిగి ఉంటుంది. సిస్టం ప్రాధమిక మెమెరీ 6జీబి, ప్రత్యామ్నాయంగా మరో 8జీబి. 500జీబీ హెచ్ డీడీ, 32జీబి ఎస్ఎస్‌డీ బూట్‌అప్ వేగాన్ని రెట్టింపు చేస్తాయి.

ల్యాపీ కనెక్టువిటీ అంశాలను పరిశీలిస్తే హెచ్‌డిఎమ్ఐ అవుట్, ఇతర్‌నెట్, యూఎస్బీ 3.0 వంటి అంశాలు డేటాను వేగవంతంగా షేర్ చేస్తాయి. ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ సౌలభ్యత కలదు. ఏర్పాటు చేసిన ఇంటెల్ స్మార్ట్‌రెస్పాన్స్ టెక్నాలజీ సిస్టం పనితీరును మెరుగుపరుస్తుంది. మరో ఫీచర్ ఇంటెల్ రాపిడ్ స్మార్ట్ టెక్నాలజీ ల్యాపీని స్లీప్ మోడ్ నుంచి త్వరగా మేల్కొలుపుతుంది. డివైజ్ పూర్తి బరువు 4 పౌండ్లు. యూఎస్ మార్కెట్లో లభ్యంకానున్న ఇన్స్‌ఫిరాన్ 14Zను జూన్19 నుంచి విక్రయంచనున్నారు. ధర అంచనా రూ.30,000 నుంచి రూ.40,000మధ్య. షైనీ సిల్వర్ అవుట్‌ఫిట్‌లో ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot