మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో మాట్లాడిన చంద్రబాబు!

Posted By:

 మైక్రోసాఫ్ట్ సీఈఓ‌తో చంద్రబాబు!

రాష్ట ప్రజలకు సాఫ్ట్‌వేర్ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది హైదరాబాద్. దేశంలోని ఐదు అతిపెద్ద ఐటీ నగరాల్లో హైదరాబాద్ ఒకటి. తాజాగా రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపధ్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగం ఉనికి పై తీవ్రమైన సందిగ్థత నెలకుంది. ఈ అంశం పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని వృద్థి చేసే విషయమై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో చంద్రబాబు మాట్లాడినట్లు ప్రముఖ దినపత్రికలు వార్తా కథనాలను ప్రచురించాయి. హైదరాబాద్‌కు దీటుగా నూతన ఆంధ్రప్రవేశ్ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను అభివృద్థి చేయాలన్నది తన  సంకల్పమని ఈ ప్రక్రియలో భాగంగా మైక్రోసాఫ్ట్ తరుపున క్రీయాశీలక పాత్ర పోషించాలిన సత్య నాదెళ్లను చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. దీని పై సత్య నాదెళ్ల సానుకూలంగానే స్పందించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపధ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించి చంద్రబాబుతో చర్చలు జరిపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting