600 కొరడా దెబ్బలు... 7 సంవత్సరాల జైలు

Posted By:

ముస్లీంల పట్ల అవమానకర వ్యాఖ్యలను ప్రచురించినందుకు గాను సౌదీ అరేబియా ప్రాంతానికి చెందిన ఓ సోషల్ మీడియా వెబ్‌సైట్ ఎడిటర్‌కు సౌదీ అరేబియాలోని జిద్దా క్రిమినల్ కోర్టు 600 కొరడా దెబ్బలతోపాటు 7 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. వివరాల్లోకి వెళితే...... సౌదీ అరేబియాకు చెందిన రైఫ్ బడావీ స్థానిక సోషల్ మీడియా వెబ్‌సైట్ ‘ఫ్రీ సౌదీ లిబిరల్స్'కు ఎడిటర్‌కు వ్యవహరిస్తున్నారు.

600 కొరడా దెబ్బలు... 7 సంవత్సరాల జైలు

తన వెబ్‌సైట్ ఇంకా టెలివిజన్‌ల ద్వారా ముస్లీం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకుగాను బడావీని జూన్,2012లో అరెస్టు చేసారు. ఈ ఘటన పై విచారణ పూర్తి అయిన పిదప జిద్దా క్రిమినల్ కోర్టు బడావీకి 600 కొరడా దెబ్బలతో పాటు 7 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఈ తీర్పును న్యాయస్థానం సోమవారం వెలువరించింది. ఈ తీర్పు పై అప్పీల్‌కు వెళ్లేందుకు బడావీకి 30 రోజుల గడువు ఉంది.

అమెరికా జైలు ఏలా ఉంటుందంటే..?

ఈ మధ్య కాలంలో నేరస్తుల సంఖ్య బాగా పెరిగిపోవటంతో జైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయి. కరుడుగట్టిన నేరస్తులు.. చట్ట వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న ఉద్యమకారులు.. అవినీతికి పాల్పడ్డ బడా నాయకులు ప్రధాన జైళ్లలో ఊచలు లెక్కబెడుతున్నారు. నేర తీవ్రతను బట్టి న్యాయా స్థానాలు వీరికి శిక్షలనుఖరారు చేసాయి. కారాగారాల్లో నేరస్తుల సంఖ్య పెరుగుతుండటంతో జైలు భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. నేరస్తులు జైలు నుంచి పరారయిన సంఘటనలు ఇటీవల అనేకం ఉన్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆధునిక సెక్యూరిటీ విలువలు ఇంకా హైటెక్ హంగులతో రూపుదిద్దుకన్న అమెరికాలోని జైలు వాతవరణాన్ని తిలికించేందుకు క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot