సీగేట్ నుంచి 12TB హార్డ్‌‌డిస్క్ డ్రైవ్స్

|

అమెరికాకు చెందిన ప్రముఖ డేటా స్టోరేజ్ కంపెనీ సీగేట్ టెక్నాలజీ మూడు శక్తివంతమైన హార్డ్‌డిస్క్ డ్రైవ్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఐరన్‌ఊల్ఫ్ (IronWolf), ఐరన్‌ఊల్ఫ్ ప్రో (IronWolf Pro), బర్రాకుడా (BarraCuda Pro) మోడల్స్‌లో ఈ స్టోరేజ్ డ్రైవ్‌లు అందుబాటలో ఉంటాయి. ఏకంగా 12TB స్టోరేజ్ సామర్థ్యంతో లభ్యమవుతోన్న ఈ హార్డ్‌డిస్క్‌ డ్రైవ్స్, డేటా స్టోరేజ్ విభాగంలోనే కింగ్‌మేకర్స్‌గా అవతరించబోతున్నాయి.

 
Seagate introduces massive 12TB hard disk drives for maximum storage

12000 జీబీల డేటాను స్టోర్ చేసుకునే విధంగా రూపొందించబడిన ఈ హార్డ్‌డిస్క్‌లతో వ్యక్తిగత కంప్యూటర్లను స్టోరేజ్ సర్వర్స్‌లా మార్చేసుకోవచ్చు. డేటా స్టోరేజ్ అవసరాలు ఎక్కువుగా ఉండే లార్జ్, మీడియమ్ స్కేల్ ఎంటర్‌ప్రైజ్ బిజినెస్‌లతో పాటు క్రియటివ్ కంప్యూటింగ్ ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ హార్డ్‌‌డిస్క్ డ్రైవ్‌లను అభివృద్థి చేసినట్లు సీగేట్ వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా నమోదువుతోన్న డేటా స్టోరేజ్ వినియోగం పై ఐడీసీ సంస్థతో కలిపి సీగేట్ ఇటీవల ఓ స్టడీని నిర్వహించింది. ఈ స్టడీలో భాగంగా 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా డేటా స్టోరేజ్ వినియోగం అనేది 163జీబి జిట్టాబైట్‌లకు చేరుకోనుందట. ఇది ప్రస్తుతమున్న స్టోరేజ్ వినియోగంతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువట.

 

జియోఫోన్‌కు పోటీగా నోకియా 4జీ ఫీచర్ ఫోన్జియోఫోన్‌కు పోటీగా నోకియా 4జీ ఫీచర్ ఫోన్

ఆగ్‌మెంటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్), 4కే రిసల్యూషన్, 360 డిగ్రీ విడియో రికార్డింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు మార్కెట్లో విస్తరిస్తోన్న నేపథ్యంలో స్టోరేజ్ వినియోగం రెట్టింపవుతోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో సీగేట్ అందుబాటులోకి తీసుకువచ్చిన 12TB హార్డ్‌‌డిస్క్ డ్రైవ్‌లకు మార్కెట్లో మంచి ఆదరణ లభించే అవకాశముంది.

Seagate introduces massive 12TB hard disk drives for maximum storage

12TB BarraCuda Pro ప్రత్యేకతలు..

డెస్క్‌టాప్ కంప్యూటింగ్ నిమిత్తం ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉంచిన హార్డ్‌డిస్క్ డ్రైవ్‌లలో
12TB BarraCuda Proనే రారాజు. 12000 జీబీల డేటా స్టోరేజ్ సామర్థ్యంతో వస్తోన్న ఈ డ్రైవ్‌ డేటా
మేనేజ్‌మెంట్ అవసరాలను సమర్థవంతంగా తీరుస్తుంది. 256MB క్యాచీతో వస్తోన్న ఈ డ్రైవ్ డేటా ట్రాన్స్‌ఫర్ వేగం సెకనుకు 250MBగా ఉంటుంది. ఈ హార్డ్‌డ్రైవ్‌కు సంబంధించి అడుగు భాగంలో అమర్చిన ప్లేటర్ నిమిషానికి 7200 సార్లు రోటేట్ అవుతుంది.

5 సంవత్సరాల తయారీదారు వారంటీతో పాటు రెండు సంవత్సరాల రెస్క్యూ డేటా రికవరీని ఈ హార్డ్‌డిస్క్ కొనుగోలు పై సీగేట్ ఆఫర్ చేస్తోంది. అమెరికన్ మార్కెట్లో 12TB BarraCuda Pro హార్డ్‌డిస్క్ డ్రైవ్‌ ధర 529 డాలర్లు.

Seagate introduces massive 12TB hard disk drives for maximum storage

12TB IronWolf, IronWolf Pro ప్రత్యేకతలు..

ఈ రెండు హార్డ్‌డిస్క్ డ్రైవ్‌లు 3.5 అంగుళాల form factorను కలిగి ఉంటాయి. వీటిలో IronWolf హెల్త్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను సీగేట్ ఇన్‌స్టాల్ చేసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ అనేక డేటా రికవరీ ఆప్షన్‌లతో పాటు

పలు డేటా సెక్యూరిటీ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. Synology, QNAP వంటి నెట్‌వర్క్ అటాచుడ్ స్టోరేజ్ డివైస్‌లను ఈ రెండు హార్డ్‌డిస్క్ డ్రైవ్‌లు సపోర్ట్ చేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో 12TB IronWolf ధర 569 డాలర్లు. IronWolf Pro ధర 539 డాలర్లు.

Best Mobiles in India

Read more about:
English summary
Seagate Technology has just announced that its IronWolf, IronWolf Pro, and BarraCuda Pro hard drives are now available in capacities up to 12TB.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X