రాష్ట్రంలోకి షార్ప్ గాలి శుద్దీకరణ యంత్రాలు!

Posted By:

జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ బ్రాండ్ షార్ప్ (Sharp) ప్లాస్మాక్లస్టర్ ఐయాన్ టెక్నాలజీ‌తో కూడిన ఎయిర్ ప్యూరిఫయర్లను 10 నెలల క్రితం ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ ఉత్పత్తులు ఆశాజనకమైన అమ్మకాలు రాబడుతున్నాయి. తాజాగా షార్ప్, ఈ గాలి శుద్దీకరణ యంత్రాలను ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో విక్రయించేందుకు విశాల్ విడిభాగాల సంస్థతో వ్యాపార ఒప్పందాన్ని కుదర్చుకుంది. షార్ప్ రూపొందించిన ఎయిర్ ప్యూరిఫయర్లను ఇళ్లలోనే కాకుండా కార్లలోనూ ఉపయోగించుకోవచ్చు.

 రాష్ట్రంలోకి షార్ప్ గాలి శుద్దీకరణ యంత్రాలు!

ప్లాస్మాక్లస్టర్ ఐయాన్ టెక్నాలజీ‌తో డిజైన్ కాబడిన షార్ప్ ఎయిర్ ప్యూరిఫయర్లు జూన్ 2012 వరకు 5కోట్ల మంది వినియోగదారులన సంతృప్తిపరిచినట్లు షార్ప్ ఈ మేరకు ప్రకటించింది. ఇక భారత్‌లోని ఎయిర్ ప్యూరిఫయర్ల మార్కెట్ పరిస్థితిని విశ్లేషించినట్లయితే షార్ప్ పోటీని తట్టుకుంటూ ముందుకు సాగుతోంది. టెక్ సైన్స్ రిసెర్జ్ అంచనాల మేరకు 2016నాటికి ఎయిర్ ప్యూరిఫయర్ల మార్కెట్ 560 కోట్లకు విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. 

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

తాము అందిస్తున్న ఎయిర్ ఫ్యూరిఫయిర్లు గాలిని శుద్ధి చేసి పరిమళమైన ఇంకా స్వచ్ఛమైన ప్రాణ వాయువును ప్రజానీకానికి అందించగలవని షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ మేనేజర్ నీలేష్ అగ్నిహోత్రి అన్నారు. దుమ్ము, పొలెన్, పోగాకు పొగ, రసాయనాలు, గోడల పెయింటు, ఫర్నిషింగ్స్ తదితర పదార్థాల వల్ల గుదుల్లోని గాలి కలుషితమవుతుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఇళ్లలోని గదుల్లో ఉండే గాలి బయటికన్నా అనేక రెట్లు ఎక్కువగా కలుషితంగా ఉంటందని, ఈ సమస్యను నిరోధించే క్రమంలో స్వచ్చమైన గాలిని అందించేందుకు షార్ప్ ఫ్యూరిఫయిర్ తోడ్పడుతుందని అగ్నిహోత్రి స్పష్టం చేసారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting