మీ పీసీని ఇలా కూడా షట్‌డౌన్ చేయవచ్చు

|

రాత్రుళ్లు సినిమాలు చూస్తూ మీ పీసీని షట్‌డౌన్ చేయకుండానే నిద్రపోతున్నారా..?, ఇక మీదట అలా జరగకుండా ఉండేందుకు చక్కటి ఉపాయాన్ని మీకు సూచిస్తున్నాం. సాధారణంగా కంప్యూటర్‌ను షట్‌డౌన్ చేయాలంటే స్టార్ట్ మెనూలోకి వెళ్లవల్సి ఉంటుంది. అయితే, ఇటీవల అందుబాటులోకి వచ్చిన షట్‌డౌన్8 (shutdown8) ప్రోగ్రామ్‌ను సిస్టంలో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా పీసీని మరింత సలువుగా షట్‌డౌన్ చేయవచ్చు.

మీ పీసీని ఇలా కూడా షట్‌డౌన్ చేయవచ్చు

ఇంటర్నెట్‌లో ఉచితంగా లభ్యమవుతోన్న షట్‌డౌన్8 సాఫ్ట్‌వేర్‌ను ముందుగా పీసీలో డౌన్‌లోడ్ చేసుకోవాలి. సాఫ్ట్‌వేర్ సిస్టంలో ఇన్‌స్టాల్ కాగానే టాస్క్‌బార్‌లో కొత్త ఐకాన్ వచ్చి చేరుతుంది. అదే షట్‌డౌన్ ఆప్షన్. ఆ తరువాత ఎప్పుడైన మీరు పీసీను షట్‌డౌన్ చేయాలనుకున్నపుడు టాస్క్‌బార్‌ పై కనిపించే ఐకాన్ పై క్లిక్ చేస్తే చాలు. shutdown, log off, Restart, Timer పేర్లతో ఆప్షన్‌లు కనిపిస్తాయి.

షట్‌డౌన్, లాగ్ ఆఫ్, రీస్టార్ట్‌ల గురించి మీకు ఇప్పటికే ఓ అవగాహన ఉండి ఉంటుంది. టైమర్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా నిర్థేశించిన సమయం తరువాత పీసీ ఆటోమాటిక్‌గా షట్‌డౌన్ అయ్యేలా చేయవచ్చు. ఉదాహరణకు మీ పీసీని రెండు గంటల తరువాత షట్‌డౌన్ చేయాలనుకుంటున్నారు. shutdown8 ఐకాన్ లోని టైమర్ మెనూలోకి ప్రవేశించి shutdown in 2 hours ఆప్షన్ పై క్లిక్ చేయండి. రెండు గంటల తరువాత ఆటోమాటిక్‌గా సిస్టం షట్‌డౌన్ అవుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Shutdown Your Computers in Simple Way Through Shutdown8 Program. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X