‘పెద్దన్న’ను బెదరగొట్టే వ్యూహం?

By Prashanth
|
Simmtronics Xpad


చవక ధర టాబ్లెట్ పరిశ్రమలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ‘ఆకాష్’కు పోటీగా సిమ్‌ట్రానిక్స్ సంస్థ ‘ఎక్స్‌ప్యాడ్’ పేరుతో టాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. వివిధ స్ర్కీన్ వేరియంట్‌లలో ఈ కంప్యూటింగ్ పీసీలు లభ్యంకానున్నాయి. ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆధారితంగా స్పందించే ఈ డివైజ్‌లు మన్నికైన కంప్యూటింగ్‌ను ఉత్పత్తి చేస్తాయి. 7,8,9,9.7,10.1 స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యంకానున్న ఈ పీసీ కీలక అంశాలు...

- ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

- 1 గిగాహెట్జ్ క్లాక్ ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం గల కార్టెక్స్ ఆర్మ్8 ప్రాసెసర్,

- మల్టీ టచ్‌ డిస్‌ప్లే టెక్నాలజీ,

- మెమరీ సామర్ధ్యం 4జీబి,

- మైక్రోఎస్‌డి స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

- వై-ఫై కనెక్టువిటీ, 3జీ కనెక్టువిటీ, యూఎస్బీ పోర్ట్,

- హైడెఫినిషన్ వీడియో అవుట్ (హెచ్ డిఎమ్ఐ పోర్ట్),

ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్‌లలో ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ లభ్యమవుతోంది. నెలకు 3,00,000 యూనిట్‌లను ఉత్పత్తి చేస్తున్నారు. ధర అంచనా రూ.4,000. డిమాండ్ నేపధ్యంలో ఈ ధరను మరింత తగ్గించే అవకాశముందని సిమ్‌ట్రానిక్స్ వర్గాలు ప్రకటించాయి. ఈ సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ ఆకాష్‌తో పాటు ఇతర లో బడ్జెట్ టాబ్లెట్ తయారీ సంస్థలను బెంబేలెత్తించే అవకాశముందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X