సిమ్‌ట్రానిక్స్ నుంచి సరికొత్త డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్ టాబ్లెట్
ఢిల్లీకి చెందిన ప్రముఖ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ కంపెనీ సిమ్‌ట్రానిక్స్ ‘ఎక్స్‌ప్యాడ్ టర్బో' పేరుతో సరికొత్త డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 3జీ వాయిస్ కాలింగ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వంటి ప్రత్యేకతలు ఈ డివైజ్‌లో ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో ఈ 3జీ వాయిస్ కాలింగ్ టాబ్లెట్ ధర రూ.7,999. ప్రస్తుతం ఈ డివైజ్ ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ Snapdeal వద్ద లభ్యమవుతోంది. టాబ్లెట్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే....

డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్ కనెక్టువిటీ,
7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,024 x 600పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
మాలీ 400ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
2 మెగా పిక్సల్ రేర్ కెమరా,
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
3జీ కనెక్టువిటీ (వయా సిమ్‌కార్డ్ స్లాట్), వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, ఏ-జీపీఎస్,
ఇతర కనెక్టువిటీ ఫీచర్లు: ఎఫ్ఎమ్ రేడియో, ఇన్-బుల్ట్ స్పీకర్లు, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్,
2,800ఎమ్ఏహెచ్ బ్యాటరీ (140 గంటల స్టాండ్‌బై టైమ్).
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








