2015నాటికి కెన్యాలో 60 లక్షల మందికి సోలార్ కాంతి!

Posted By:

కెన్యాలో సోలార్ విద్యుత్ దీపాలను వినియోగిస్తున్న వారి సంఖ్య 2015 ముగింపునాటికి 60 లక్షలకు చేరుకోనుందని అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) మంగళవారం అభిప్రాయపడింది. ఈ ప్రాంతంలో సోలార్ విద్యుత్ దీపాల వినియోగానికి సంబంధించి 2013లో 30 లక్షల నుంచి 40 లక్షల జనాభా సోలార్ లైటింగ ఆధారపడినట్లు లైటింగ్ ఆఫ్రికా ప్రోగ్రామ్ మేనేజర్ ఐటోటియా ఎన్జాగీ ఓ ప్రముఖ పత్రికకు వెల్లడించారు. ఆశాజనకమైన ధరల్లో సోలార్ టెక్నాలజీ లభ్యమవటంతో గడిచిన మూడు సంవత్సరాలుగా సోలార్ దీపాల వినియోగం అమాంతం పెరిగినట్లు సంస్థ పేర్కొంది.

2015నాటికి కెన్యాలో 60 లక్షల మందికి సోలార్ కాంతి!

బ్రిటన్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ సోలార్ ఎయిడ్ సహకారంతో కెనాల్లో సన్నీమనీ సోలార్ లైట్‌లను ఆవిష్కరించినట్లు ఎన్జాగీ తెలిపారు. కిరోసిన్ ధీపాల వినియోగాన్ని కెన్యాలో పూర్తిగా నిరోధించే లక్ష్యంతో సోలార్ఎయిడ్ సంస్థ ఈ స్వచ్చంద కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు.

విద్యుత్ శక్తికి ప్రత్యామ్నాయంగా అవతరించిన సౌరశక్తి అనేక విధాలుగా ఉపయోగపడుతోంది. ఎనభైశాతం వరకు భూబాగంలో రోజుకు 6 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యకాంతి లభిస్తోంది. ఈ సూర్య కిరణాల ద్వారా సేకరించే విద్యుత్ శక్తిని పరిశోధన స్థాయి నుంచి ఉద్పాదత స్థాయి వరకు ఉపయోగించుకుంటున్నాం. సౌర శక్తిని కొద్ది దేశాలు మాత్రమే పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సౌర శక్తి వినియోగం కేవలం గృహోపయోగఅవసరాలకు మాత్రమే పరిమితమవుతోంది. సాంకేతిక పరిజ్ఞానం మరింతగా అభివృద్థి చెందిన పాశ్చాత్య దేశాల్లో సౌర శక్తిని వినూత్న ప్రయోగాలకు ఉపయోగిస్తున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting