పేరు ఇరగదీసింది.. ట్రై చేస్తే ఏలా ఉంటుందో?

టాబ్లెట్ పీసీల నిర్మాణ రంగంలోకి తాజాగా ఆరంగ్రేటం చేసిన సంస్థ స్కైటెక్స్ (Skytex) రెండు ఆండ్రాయిడ్ ఆధారిత కంప్యూటింగ్ టాబ్లెట్ పీసీలను ప్రకటించింది. స్కైప్యాడ్ ప్రోటోస్, స్కైప్యాడ్ జెమిని మోడళ్లలో విడుదలవుతున్న ఈ ఆండ్రాయిడ్ ఆధారిత కంప్యూటింగ్ డివైజ్‌లు ఉత్తమ క్వాలిటీ కంప్యూటింగ్‌ను అందిస్తాయి. త్వరలో విడుదల కాబోతున్న ఈ పీసీలు ద్వారా క్లౌడ్ సర్వీస్‌లను యాక్సిస్ చేసుకోవచ్చు.
స్కైప్యాడ్ ప్రోటోస్ ఫీచర్లు:
9.7 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 5మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, శక్తివంతమైన 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (20గంటలు వెబ్ యూసేజ్), 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, మినీ యూఎస్బీ పోర్ట్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ. ధర రూ.15,000.
స్కైప్యాడ్ జెమిని ఫీచర్లు:
ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఆప్టిమైజుడ్ వై-ఫై,
హెచ్‌డిఎమ్ఐ అవుట్‌పుట్.


Click it and Unblock the Notifications








