త్వరలో రానున్న శ్యామ్‌సంగ్ గెలక్సీ..!

Posted By: Staff

త్వరలో రానున్న శ్యామ్‌సంగ్ గెలక్సీ..!

ఫ్లాష్.. ఫ్లాష్.. ల్యాప్‌టాప్‌లను వినియోగించే వారందరూ వాటిని పక్కన పెట్టి పాకెట్ సైజు కంప్యూటర్లైన టాబ్లెట్‌లను వినియోగిస్తూ తమ పనులను చక్కబెట్టకుంటున్నారట..! అవును ప్రస్తుత ఇండియన్ మార్కెట్లో టాబ్లెట్ పీసీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

ప్రపంచ టాబ్లెట్ మార్కెట్లో టాప్ 5లో నిలిచిన శ్యామ్‌సంగ్, Galaxy Tab 10.1 పేరుతో సరికొత్త టాబ్లెట్‌ను విడుదల చేస్తామంటూ ప్రకటనలు గుప్పించింది. అయితే ఈ బ్రాండ్ విడుదల పై ఆశలు పెట్టుకున్నఅనేక మంది వినియోగదారులు Galaxy Tab 10.1 విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే వీరికి విశ్లేషకులు మాత్రం మరో శుభవార్తను చెబుతున్నారు. అత్యాధునిక సాంకేతికతతో పాటు ఉన్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న శ్యామ్‌సంగ్ మరో మోడల్ Galaxy Tab 8.9 మార్కెట్లో ఏ క్షణాన్నైనా విడుదల కావచ్చట.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మోడల్ విడుదల పై శ్యామ్‌సంగ్ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ టాబ్లెట్ల అమ్మకాలకు సంబంధించి ఆనలైన్ షాపింగ్ రారాజైన ఆమోజోన్ మాత్రం UK కోనుగోలుదారులు దగ్గర నుంచి ఆడ్వాన్స్ బుకింగ్ తీసుకుంటుంది.

Galaxy Tab 8.9ను ప్రపంచ వ్యాప్తంగా శ్యామ్‌సంగ్ విడుదల చేస్తే ఆ మోడల్ ఖచ్చితంగా భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు అంతవరకు అగలేమనుకుంటే రూ.47000 చెల్లించి తర్డ్ పార్టీ ద్వారా Galaxy Tab 8.9ను పొందవచ్చు.

హనీకాంబ్ ఆండ్రాయిడ్ 3.2 అత్యాధినిక ఆపరేటింగ్ వ్యవస్థతో రూపుదిద్దుకుంటున్న Galaxy Tab 8.9, 8.9 అంగుళాల డిస్ ప్లే సామర్థ్యంతో touch sensitive స్వభావం కలిగి ఉంటుంది. హై డెఫినిషన్ (HD) ప్లేబ్యాక్ తో అత్యుత్తమ resolution కలిగి ఉంటుంది. అయితే Galaxy Tab 8.9లో అనుసంధానించబడిన 3G plus Wi-Fi ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గత కొంత కాలంగా వినియోగదారులను ఊరిస్తూ.. ఊహలు పెంచుతున్న శ్యామ్‌సంగ్ స్మాలర్ వర్షన్ టాబ్లెట్లు మార్కెట్లో త్వరగా విడుదలైన హిట్ కొట్టాలని ఆశిద్దాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot