ప్రపంచపు అతిచిన్న డెస్క్‌టాప్ పీసీ!!

Posted By: Super

ప్రపంచపు అతిచిన్న డెస్క్‌టాప్ పీసీ!!

 

కంప్యూటింగ్ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు సాంకేతిక వ్యవస్థను మరింత చేరువ చేస్తున్నాయి. సౌకర్యవంతమైన కంప్యూటింగ్‌కు గాను అత్యధిక మంది వినియోగదారులు ల్యాప్‌టాప్ కంప్యూటర్ల వైపు మెగ్గుచూపుతున్నారు. అయినప్పటికి డెస్క్‌టాప్ కంప్యూటర్లకు ఏ మాత్రం క్రేజ్ తగ్గటం లేదు.

పర్సనల్ కంప్యూటర్ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసే క్రమంలో ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు ‘లెనోవో’ (Lenovo) అతి చిన్న డెస్క్‌‌టాప్ పీసీని డిజైన్ చేసింది. ‘ఐడియా సెంటర్ Q180’గా రూపుదిద్దుకున్న ఈ పీసీ ప్రపంచంలోనే అతి చిన్న డెస్క్‌టాప్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌గా గుర్తింపుతెచ్చుకుంది. కాంపాక్ట్ సైజులో స్లిమ్‌గా రూపుదిద్దుకున్న ఈ డివైజు చుట్టు కొలతలు 7.5 inch x 6.1 inch x 0.86 inch (H x W x D).

డెస్క్‌టాప్ పీసీని పూర్తి స్ధాయి కంప్యూటర్ లేదా, పూర్తి స్ధాయి టెలివిజన్‌లా మార్చుకోవచ్చు. రెండు వర్షన్‌లలో ఈ డెస్క్‌టాప్ కంప్యూటర్ల లభ్యమవుతున్నాయి. ఒక మోడల్ ‘Q180-31102AU’ కాగా మరో మోడల్ ‘Q180-31102BU’ పటిష్టమైన ఇంటెల్ ఆటమ్ D2700 ప్రాసెసింగ్ వ్యవస్థను ఈ రెండు గాడ్జెట్లలో నిక్షిప్తం చేశారు. ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ 2.13 GHz.

మన్నికైన ఇంటెల్ ఆటమ్ D2700 ప్రాసెసర్ ‘లో వోల్టేజ్’ వాతావరణంలోనూ అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. అంతేకాదు ఈ ప్రాసెసింగ్ వ్యవస్థ తక్కువ పవర్‌ను ఖర్చు చేస్తుంది. వై-ఫై, ఇంటిగ్రేటెడ్ బ్లూటూత్ వ్యవస్థలు కనెక్టువిటీ సామర్ధ్యాన్ని మరింత పిటిష్టితం చేస్తాయి. ఈ డెస్క్‌టాప్ పీసీల హార్డ్‌డిస్క్ సామర్ధ్యం 500 జీబీ. గ్రాఫిక మెమరీ సామర్ధ్యం 512 ఎంబీ, Q180-31102AUలో 2జీబీ ర్యామ్ సామర్ధ్యంతో రూ.20,000లకు లభ్యమవుతుండగా, Q180-31102BU 4జీబీ సామర్ధ్యంతో రూ.23,500లకు లభిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot