మార్కెట్లోకి స్టార్ట్రాన్‌ 2-in-1 ల్యాపీలు, ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి

|

భారతదేశపు మొట్టమొదటి గ్లోబల్ టెక్నాలజీ, ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారుదారు(OEM) స్టార్ట్రాన్‌ కంపెనీ వచ్చే తరం ల్యాపీలను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. tbook flex పేరుతో విడుదలైనఈ ల్యాపీలు మే 13నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులో ఉంటాయని స్టార్ట్రాన్‌ కంపెనీ వెల్లడించింది. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఈ హైబ్రిడ్‌ ల్యాప్‌టాప్‌ చాలా తొందరగా టాబ్లెట్‌, ల్యాప్‌టాప్‌ మోడ్‌లోకి మారడమే ప్రత్యేకత అని కంపెనీ పేర్కొంది. ఎం3, ఐ 5 అనే వెర్షన్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చిన వీటి ధరలు వరుసగా రూ .42,990, రూ. 52,990 లుగా ఉండనున్నాయి.

 
మార్కెట్లోకి స్టార్ట్రాన్‌ 2-in-1 ల్యాపీలు, ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి

12.2అంగుళాల డిస్‌ప్లే, 2560x1600 పిక్సెల్స్ రిజల్యూషన్, లైట్‌ బాడీ, డిటాచ్‌బుల్‌ బ్యాక్‌లిట్‌ కీబోర్డు, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, థండర్‌ బోల్ట్‌ 3 యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌, ఇంటెల్ 7వ జనరేషన్ కోర్ ఎం3/ఐ5 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128 జీబీ ఎస్‌ఎస్‌డీ, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇంకా మల్టీ-టచ్ డిస్‌ ప్లే, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరాను ఈ డివైస్‌ కలిగి ఉంది.

రూ.13,499కే 32 ఇంచ్ స్మార్ట్‌టీవీ, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు,షియోమికి భారీ షాక్రూ.13,499కే 32 ఇంచ్ స్మార్ట్‌టీవీ, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు,షియోమికి భారీ షాక్

డబుల్‌ మైక్‌, ఫవర్‌ఫుల్‌ స్పీకర్లు , ఫాస్ట్‌ డ్యుయల్‌ బ్యాండ్‌ వై-ఫై,బ్లూటూత్ 4.0, యూఎస్‌బీ టైప్ సి ఇతర ఫీచర్లు. స్పెషల్‌ డ్యుయల్‌ టోన్ ఫినీష్‌, ఫిక్స్‌ స్టాండ్‌సహాయంతో 150 డిగ్రీల వరకు ఈ ల్యాప్‌టాప్‌ను నిలవపచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆరెంజ్‌ గ్రే, బ్లాక్‌ గ్రే కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Smartron tbook flex 2-in-1 laptop can flex up to 150 degrees and also comes with a fingerprint sensor. More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X