Home
Computer

‘S, C, E, Y’ పదాలనుకుంటే పొరపాటే..

By Super
Sony Vaio
అద్భుతమైన వాణిజ్య ప్రకటన.. అందులో అందమైన కరీనా... ఆకట్టకునే ఆమె దుస్తులు.. అలరించే ఆమె హోయలు.. రంగు, రంగుల బ్యాక్ డ్రాప్ సెట్టింగులు.. ఇంతలోనే అమ్మడు చేతిలో తళుక్కుమనే ‘Sony Vaio’ ల్యాప్‌టాప్‌లు గుర్తొచ్చిందా.. కరీనా నటించిన ఈ యాడ్ ‘Sony Vaio’ ల్యాప్‌టాప్‌ల అమ్మకాలను మరింత పెంచిందట. ‘0’ సైజు బాలీవుడ్ బామ కరీనాకపూర్ ‘Sony Vaio’ ప్రచారకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

రోజుకో కొత్త రకం ‘Tablet Pc’ పుట్టుకొస్తున్న రోజులివి.. పాశ్చాత్య పోకడలను వంట పట్టించుకుంటున్న యూత్ అంతా ‘ ఆ టాబ్లెట్లకే ’ ఓకే చెబుతున్న రోజులివి.. అయినా పాత చింతకాయపచ్చడి లాంటి ల్యాప్‌టాప్‌లకు భారతీయ మార్కెట్లో మాత్రం క్రేజ్ తగ్గలేదు. రోజు.. రోజుకు ఈ వ్యాపరం విస్తరిస్తుందని విశ్లేషకుల అంచనా.

‘సోనీ’ ఈ బ్రాండ్ పేరు చెబితేనే అదోరకమైన హోదా.. ల్యాప్‌టాప్‌ల విక్రయాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఈ ‘హాట్ బ్రాండ్’ భారతీయ మార్కెట్లో తిరుగులేని రేటింగ్‌ను సంపాదించుకుంది. భారతీయ కంప్యూటింగ్ మార్కెట్లో 2011 చివరి నాటికి 5లక్షల ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు చేపట్టాలని ‘సోని’ కృతనిశ్చయంతో ఉంది. అయితే ఒకప్పుడు ధనిక వర్గానికి మాత్రమే అందుబాటులో ఉండే ‘సోని’ తన కొత్త ప్రయోగంతో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యింది.

S,C,E,Y పేర్లతో ‘Sony Vaio’ విడుదల చేసిన 4 వేరియంట్స్‌ను అటు ఉద్యోగులకు, విద్యార్థులకు, కుర్రకారుకు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడే విధంగా తయారు చేశారు. అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వీటి ధరలు రూ.22000 నుంచి రూ.1.3 లక్షల వరకు పలుకుతోంది.

ఇండియన్ మార్కెట్లో 2011 ఆర్థిక సంవత్సరానికి సంబంధిచి సోని అమ్మకాలను పరిశీలించినట్లయితే, 25 శాతం రాబడి ‘Vaio laptop’ల ద్వారా వచ్చిందని ‘Sony India’ మేనేజింగ్ డైరక్టర్ మసరు టమాగ్వ తెలిపారు. దేశ వ్యాప్తంగా 1500 ఔట్ లెట్లను ఏర్పాటు చేసి 2011 టార్గెట్ ను అధిగమించేందుకు ప్రణాళికులు రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X