సోనీ లక్ష్యం 6.5లక్షలు!

Posted By: Prashanth

సోనీ లక్ష్యం 6.5లక్షలు!

 

దేశ వ్యాప్తంగా సోనీ వయో బ్రండ్ ల్యాప్‌టాప్‌ల విక్రయాలకు సంబంధించి తాజాగా వెల్లడైన గణాంకాలు ఆ బ్రాండ్ భవిష్యత్‌ను సూచిస్తున్నాయి. 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు సోనీ ఇండియా ఐటీ, మొబైల్ హెడ్ సచిన థాపర్ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భాగంగా వయో బ్రండ్ ల్యాప్‌టాప్‌ల అమ్మకాలను 6.5లక్షల యూనిట్లకు పెంచే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారత ల్యాప్‌టాప్‌ల విపణిలో వయో బ్రాండ్‌కు 16 శాతం వాటా ఉంది. మార్చి నాటికి 18-19 శాతానికి చేరుకోవాలన్నదే తమ ధ్యేయమని సచిన్ అన్నారు. ఇక సోనీ ఇండియా ఆదాయంలో వయో బ్రాండ్ 20 శాతం సమకూర్చిందని, ఆర్థిక సంవత్సరాంతానికి ఇది 25 శాతానికి చేరుతుందని చెప్పారు.

మన రాష్ట్రంలో...

2011-12 ఆర్థిక సంవత్సరానికి గాను సోనీ ఇండియా, రాష్ట్రంలో 28,000 యూనిట్ల వయో శ్రేణి ల్యాప్‌టాప్‌లను విక్రయించింది. ప్రస్తుత 2012-13 ఆర్థిక సంవత్సరంలో 40 వేల యూనిట్లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ వయో బ్రాండ్‌కు 15 శాతం మార్కెట్ వాటా ఉంది. మార్చికల్లా ఇది 18 శాతానికి చేరుతుందని కంపెనీ భావిస్తోంది. వయో ల్యాప్‌టాప్‌ల మొత్తం అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఆరు శాతం.

మీకు బెస్ట్ ఛాయిస్!!

ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..?, బ్రాండ్ ఎంపిక పై తర్జనభర్జన పడుతున్నారా..?, కంప్యూటింగ్ అవసరాలను పరిపుష్టిగా తీర్చేందుకు సోనీ ముందుకొచ్చంది. ఉన్నత ప్రమాణాలతో కూడిన గ్యాడ్జెట్ ఉత్పత్తులను టెక్ ప్రపంచానికి అందిస్తూ పోటీ మార్కెట్‌లో ధీటుగా నిలుస్తున్న సోనీ, వయో సిరీస్ నుంచి ఉత్తమ ఫీచర్లతో కూడిన ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేసింది.

వయో E సిరీస్ నుంచి VPCEG34FX/B మోడల్‌గా వస్తున్న ల్యాపీ స్పెసిఫికేషన్స్ , ఫీచర్స్:

* 14 అంగుళాల LED డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1366 × 568 పిక్సల్స్),

* ఇన్-బుల్ట్ వెబ్‌క్యామ్, మైక్రో ఫోన్,

* 4జీబి ఇంటర్నల్ మెమెరీ,

* ఎస్డీ కార్డ్ సపోర్ట్,

* వై-ఫై సపోర్ట్, హెచ్‌డిఎమ్ఐ అవుట్,

* బ్లూరే డ్రైవ్,

* యూఎస్బీ 2.0 పోర్ట్స్,

* విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ ఆపరేటింగ్ సిస్టం,

* ఇంటెల్ కోర్ i5-2540M ప్రాసెసర్,

పొందుపరిచిన ఇంటెల్ వైర్‌లెస్ టెక్నాలజీ ఆధారితంగా ల్యాపీని హై డెఫినిషన్ టీవీలకు జతచేసుకోవచ్చు. ప్రస్తుతానికి యూఎస్‌లో లభ్యమవుతున్న సోనీ వయో VPCEG34FX/B త్వరలో ఇండియాకు రానుంది. ధర రూ. 40,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot