2టీబీ హైస్పీడ్ పోర్టబుల్ హార్డ్ డిస్క్ డ్రైవ్ ను ఆవిష్కరించిన సోనీ

|

నాణ్యమైన డేటా స్టోరేజ్‌ను కోరకునే వారి కోసం 2టీబీ స్టోరేజ్ సామర్థ్యం గల సరికొత్త హైస్పీడ్ పోర్టబుల్ హార్డ్‌డిస్క్ డ్రైవ్‌ను సోనీ మార్కెట్లో విడుదల ేచసింది. పీఎస్‌జెడ్ -హెచ్ఏ2టీ మోడల్ నెంబరు పై లభ్యమవుతున్న ఈ హార్డ్‌డిస్క్ డ్రైవ్ ధర రూ.16,706. ఈ హార్డ్ డిస్క్‌డ్రైవ్ డేటా ట్రాన్స్‌ఫర్ వేగం సెకనకు 120ఎంబిగా కంపెనీ పేర్కొంది. సోనీ ఈ లైనప్ నుంచి 500జీబి (పీఎస్‌జెడ్ - హెచ్ఏ50), 1టీబీ (పీఎస్‌జెడ్ - హెచ్ఏ1టీ), 256జీబి (పీఎస్‌జెడ్ - హెచ్ఏ25) వేరియంట్‌లలో పోర్టబుల్ స్టోరేజ్ డ్రైవ్‌లను ఆవిష్కరించింది.

 
2టీబీ హైస్పీడ్ పోర్టబుల్ హార్డ్ డిస్క్ డ్రైవ్ ను ఆవిష్కరించిన సోనీ

యూఎస్బీ 3.0 పోర్ట్ అలానే రెండు ఫైర్‌వైర్ 800 పోర్ట్‌లను ఈ హార్డ్‌డ్రైవ్‌లో ఏర్పాటు చేసారు. డేటా ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి స్టేటస్‌ను తెలుసుకునేందుకు ప్రత్యేకమైన ఎల్ఈడి ఇండికేటర్‌ను ఈ డ్రైవ్‌లో ఏర్పాటు చేసారు. విండోస్ ఇంకా ఓఎస్ ఎక్స్ (మ్యాక్) ఆపరేటింగ్ సిస్టంలను ఈ డ్రైవ్ సపోర్ట్ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన రిటైల్ అవుట్‌ లెట్‌లలో ఈ హార్డ్‌డిస్క్ డ్రైవ్ లభ్యమవుతోంది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/9iz3knsLufo?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X